Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ఆమోదం రాజన్ విశ్వాసం

88వాషింగ్టన్ : దీర్ఘకాలం వాయిదా పడుతూ వస్తు న్న జిఎస్‌టి(వస్తు, సేవల పన్ను) బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొం దుతుందని ఆర్‌బిఐ గవర్నర్ రఘు రాం రాజన్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్‌డిఎ ప్రభుత్వం హయాంలో కలెక్షన్లు మెరుగవుతున్నాయని, టాక్స్ బేస్ విస్తృతమైందని ఇక్కడ అమెరికా ఇన్వెస్టర్లతో ఆయన అన్నారు. న్యూయార్క్‌లో యుఎస్ -ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యుఎస్‌ఐబిసి) నిర్వహించిన వేడుక లో రాజన్ మాట్లాడుతూ, రిజర్వు బ్యాం కు బ్యాంకుల నిరర్థక ఆస్తులను క్లీనప్ చేసుకో వడానికే ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. మొండి బకా యిలను వదిలించుకునేందుకు బ్యాంకులకు సర్వాధికారాలను ఇచ్చామని తెలిపారు. ఆర్థిక స్థిరీకరణ, ద్రవ్యోల్బణం నియంత్రణ పై ఆర్‌బిఐ దృష్టి పెట్టిందని, తాము అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని కార్యక్రమంలో రాజన్ వివరించారు. రిజర్వు బ్యాంకులు వడ్డీ రేట్లకు కొత్త విధానం తీసుకొస్తుందని అన్నారు.
2016లోనూ ఆర్‌బిఐ రేట్లలో మార్పుండదు: నోమురా
ద్రవ్యల్బణం దృష్టా 2016 సంవత్సరం లోనూ రెపో రేటు మార్పు ఉండకపోవ చ్చని నోమురా నివేదిక వెల్లడించింది. వినిమయ ధరల సూచీ(సిపిఐ) ద్రవ్యోల్బ ణం 2017 మార్చి నాటికి 5 శాతానికి పైగా ఉండనుందనే అంచనాలతో వడ్డీ రేట్లలో మార్పు లేమీ ఉండబోవని సంస్థ వివరించింది. అయితే ఇప్పటివరకు తగ్గించిన వడ్డీ రేట్లను బ్యాంకులు రుణ గ్రస్తులకు బదిలీ చేయాలని విషయంపైనే ఆర్‌బిఐ ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించవ్చని నివేదికలో సంస్థ తెలిపింది.

Comments

comments