Search
Thursday 19 July 2018
  • :
  • :
Latest News

షరతులతో విలీనానికి ఆమోదం

IDEA

 వొడాఫోన్-ఐడియా డీల్‌కు ఆమోదం తెలిపిన డాట్
 అతిపెద్ద టెలికామ్ సంస్థ ఆవిర్భావం

న్యూఢిల్లీ: వొడాఫోన్, ఇండియా సెల్యులార్ విలీన ఒప్పందానికి టెలికామ్ శాఖ(డాట్) ఆమోదం తెలిపింది. దీంతో దేశంలోనే అతిపెద్ద టెలికామ్ సంస్థ ఆవిర్భవించింది. షరతులతో ఈ రెండు సంస్థల ఒప్పందానికి డాట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. వొడాఫోన్ స్పెక్ట్రమ్‌కు గాను రూ.3,926 కోట్లు, బ్యాంక్ గ్యారెంటీగా రూ.3,342 కోట్లు చెల్లించాలని ఐడియా సెల్యులార్‌ను టెలికామ్ శాఖ ఆదేశించింది. ఇక నుంచి ఐడియావొడాఫోన్ సంయుక్త ఆపరేషన్లు నిర్వహించనుండగా, మార్కెట్ వాటా 35 శాతం, సబ్‌స్ర్కైబర్లు 430 మిలియన్లకు చేరనున్నారు. ఈ విలీనం ఆమోదంతో అప్పుల్లో కూరుకుపోయిన ఇరు సంస్థలు ఐడియా, వొడాఫోన్‌లకు ఊరటనిచ్చింది. జియో టెలికామ్ రంగంలోకి ప్రవేశించి ఉచిత వాయిస్ కాల్స్‌ను ప్రారంభించిన తర్వాత వీటి లాభాలు దారుణంగా పడిపోయాయి. దీంతో దేశంలో అన్ని టెలికామ్ సర్కిళ్లలో 4జి స్పెక్ట్రమ్ ఏర్పాటు సామర్థం ఇవి సాధిస్తాయి. ఐడియా ప్రకారం, 12 దేశీయ మార్కెట్లలో మొబైల్ ఫోన్లపై సెకండ్‌కు 450 వరకు బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్‌ను ఇరు సంస్థలు అందించే సామర్థాన్ని కలిగి ఉంటాయి.
నంబర్ 1 ట్యాగ్ కోల్పోనున్న ఎయిర్‌టెల్
ఇప్పటివరకు దేశంలో అతిపెద్ద టెలికామ్ సంస్థగా ఎయిర్‌టెల్ ఉంది. వొడాఫోన్, ఇండియా సెల్యులార్ విలీన ఒప్పందానికి డాట్ ఆమోదంతో ఈ ట్యాగ్‌ను ఎయిర్‌టెల్ కోల్పోనుంది. ఈ విలీన సంస్థను వొడాఫోన్ ఐడియా లిమిటెడ్‌గా పిలువనున్నారు. ఈ సంస్థల అప్పులు రూ.లక్షన్నర కోట్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
వొడాఫోన్‌కు 41.1 శాతం వాటా
ఈ సంస్థలు విలీనం కాగా వీటిలో వొడాఫోన్‌కు 41.1 శా తం వాటా దక్కనుంది. అదే సమయంలో కుమార్ మంగళం బిర్లా నేతృత్వంలోని ఆదిత్య బిగ్లా సంస్థ 26 శాతం వాటాను, ఐడియా వాటాదారులు 28.9 శాతం వాటాను పొందనున్నారు. వొడాఫోన్ నుంచి అదనపరు వాటాగా 9.5 శాతం వరకు పొందే హక్కు ఆదిత్య బిర్లాకు ఉంది.
షరతు విధించిన డాట్
ఇరు సంస్థల విలీనానికి డాట్ ఆమోదం గత నెలలోనే పొం దాల్సి ఉంది. అయితే రూ.4700 కోట్లు చెల్లిస్తేనే ఆమోదం తెలుపుతామని డాట్ షరతు విధించింది. ‘ఈ ఒప్పందంతో ఐడియాలో వొడాఫోన్‌కు చెందిన అన్ని సంస్థలు విలీనం కానున్నాయి. ఆ కంపెనీ(వొడాఫోన్)పై ఒటిఎస్‌సి(వన్ టైమ్ స్పెక్ట్రమ్ చార్జీలు)కు చెందిన రూ.4700 కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉంది. వీటిని క్లియల్ చేయాలని డాట్ వొడాఫోన్‌ను ఆదేశించింది’ అని గత నెలలో అధికారులు తెలిపారు. 2015లో వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌లో నాలుగు అనుబంధ సంస్థలు వొడాఫోన్ ఈస్ట్, వొడాఫోన్ సౌత్, వొడాఫోన్ సెల్యులార్, వొడాఫోన్ డిజిలింక్ వొడాఫోన్ విలీనం చేసింది. ఈ వొడాఫోన్ మొబైల్ సర్వీసెస్‌ను ఇప్పుడు వొడాఫోన్ ఇండియాగా పిలుస్తున్నారు. అప్పటి విలీన సమయంలోనే రూ.6,678 కోట్ల ఒటిఎస్ బకాయిలను చెల్లించాలని వొడాఫోన్‌ను డాట్ ఆదేశించగా, కంపెనీ కోర్టులో సవాల్ చేసింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ డీల్ ఆమోదానికి గాను వొడాఫోన్ రూ.2 వేల కోట్ల బకాయిలను మాత్రమే చెల్లించింది. అనంతరం టెలికామ్ మంత్రి మనోజ్ సిన్హా ఈ అంశంపై చర్యలు చేపట్టాలని డాట్‌ను ఆదేశించారు. వొడాఫోన్ ఇండియా నుంచి ఒటిఎస్ బకాయిలు వసూలు చేసే విషయమై న్యాయ సలహాలను తీసుకోవాలని డాట్‌కు ఆయన సూచించారు. న్యాయ సలహాలను తీసుకున్న డాట్.. వొడాఫోన్ నుంచి బకాయిల వసూలుకు మరోసారి డిమాండ్ చేసింది.

Comments

comments