Home ఆదిలాబాద్ ఆదిలాబాద్ లో ఎఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య

ఆదిలాబాద్ లో ఎఆర్‌ఎస్‌ఐ ఆత్మహత్య

police

ఆదిలాబాద్: సంజయ్ నగర్ కాలనీలో శివాజీ చౌహన్(48) అనే ఎఆర్‌ఎస్‌ఐ తన నివాసంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది గమనించిన కుటుంబ సభ్యులు తక్షణమే అతడ్ని రిమ్స్ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా డిచ్‌పల్లి వద్ద అతడు మృతిచెందాడు. శివాజీ చౌహన్ 1990 బ్యాచ్‌లో ఎఆర్ కానిస్టేబుల్‌గా ఎంపికై పదోన్నతిని అందుకున్నాడు. ప్రస్తుతం ఐటి కోర్ ఇంఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు. మృతుడికి భార్య ముగ్గురు పిల్లలున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సిఉంది. ఈ ఘటనపై కేసు నమోదు  చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.