Home సినిమా ఓవర్సీస్ బాద్‍షా..!

ఓవర్సీస్ బాద్‍షా..!

Aravinda Sametha Collections create records in Overseas

హైదరాబాద్: జూనియర్ ఎన్ టిఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఈ నెల 11న విడుదలైన ‘అరవింద సమేత వీర రాఘవ’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇటు తెలుగు రాష్ట్రాలతో పాటు అటు ఓవర్సీస్ లోనూ ఈ మూవీ కలెక్షన్ల కనక వర్షం కురిపిస్తోంది. తాజాగా వసూళ్ల పరంగా మరే తెలుగు హీరోకూ సాధ్యంకాని ఓ రికార్డును తారక్ సొంతం చేసింది. ఓవర్సీస్ లో భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే సుమారు 1.7 మిలియన్‌ డాలర్లను (దాదాపు రూ. 12.50 కోట్లు) రాబట్టింది. ఇంతకుముందు ఈ స్థాయిలో బయటి దేశాల్లో కలెక్షన్లు సాధించిన మన తెలుగు కథనాయకుల్లో పవన్ , మహేష్, ప్రభాస్, రాంచరణ్, నాని తదితరులు ఉన్నారు. కానీ, వీరెవరూ తమ వరుస నాలుగు సినిమాల్లో ఇంత వసూళ్లు సాధించలేకపోయారు. ఆ రికార్డు తారక్ అందుకోవడం విశేషం. ‘అరవింద సమేత’ కంటే ముందు ఎన్ టిఆర్ హీరోగా వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతా గ్యారేజ్‌’, ‘జై లవకుశ’ చిత్రాలు 1.5 మిలియన్‌ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. అయితే, ఇలా వరుసగా నాలుగు చిత్రాలతో మిలియన్ డాలర్ల మార్క్ ను అందుకుని ఈ ఘనత సాధించిన తొలి తెలుగు హీరో తారక్ కావడం గమనార్హం. కొన్ని ఏరియాలో ఈ చిత్రం బాహుబలి రికార్డులను సైతం అధిగమించడం ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్చ పరుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రం రూ. 100 కోట్ల (గ్రాస్) మార్కును అందుకున్నట్లు తెలుస్తోంది.

Aravinda Sametha Collections create records in Overseas.

Telangana Breaking News