Search
Wednesday 17 October 2018
  • :
  • :

రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతున్న‘అరవింద సమేత..’

ntr

యంగ్ టైగర్ ఎన్ టిఆర్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత.. వీర రాఘవ’ చిత్రం బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.60 కోట్లు కొల్లగొట్టిందని విశ్లేషకులు తెలిపారు. దీంతో  నాన్‌ ‘బాహుబలి’ రికార్డును సృష్టించినట్లు పేర్కొన్నారు. ఈ చిత్రం ‘బాహుబలి’ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఆ స్థాయిలో వసూళ్లు రాబట్టిన చిత్రమిదని తెలిపారు. ఈ చిత్రం కేవలం తెలంగాణలో మొదటి రోజున రూ.8.30 కోట్లు (గ్రాస్‌) రాబట్టినట్లు సమాచారం. ఈ చిత్రం విదేశాల్లోనూ అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. అమెరికాలో యూఎస్‌లో మొత్తం 218 లొకేషన్లలో ప్రదర్శితమవుతోన్న ‘అరవింద సమేత’.. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల (సుమారు రూ.7.36 కోట్లు) మార్క్‌ను దాటేసింది. యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్ టిఆర్ ఆరో చిత్రం కాగా, వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్ టిఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవనున్నట్లు తెలుస్తుంది. శుక్రవారం షోలు పూర్తయ్యే సరికి ఈ సినిమా 2 మిలియన్ డాలర్ల వసూళ్లు చేయడం ఖాయమంటున్నారు. ఇక ఆస్ట్రేలియాలో టాప్‌-10 జాబితాలోకి ఈ చిత్రం చేరిపోయింది. అక్కడ 35 లొకేషన్లలో విడుదలైన ఈ చిత్రం రూ.67.63 లక్షలు రాబట్టిందని విశ్లేషకులు తెలిపారు. వారాంతంలో సినిమా అధిక కలెక్షన్స్‌ రాబట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు.

 

Aravinda Sametha movie created new records

Comments

comments