Home సినిమా ఓకే వేదికపై బాబాయ్-అబ్బాయి

ఓకే వేదికపై బాబాయ్-అబ్బాయి

 

ntr

యంగ్ టైగర్ ఎన్ టిఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద సమేత.. వీర రాఘవ’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే.  దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం విజయోత్సవ సభను నిర్వహించనుంది. ఈ వేడుకలో జూ.ఎన్ టిఆర్, కళ్యాణ్ రామ్ తోపాటు నందమూరి బాలకృష్ణ సందడి చేయబోతున్నారు. చిత్రంలో పూజాహెగ్డే కథానాయికగా నటించింది. ఇక బాబాయ్, అబ్బాయి  ఇద్దరూ ఒకే వేదికపై కనపడితే చూడాలని ఎంతగానో ఎదురుచూస్తున్న అభిమానుల ఆశ నెరవేరనుంది. ఆదివారం శిల్పకళా వేదికగా జరిగే కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ, కల్యాణ్‌రామ్‌లు ముఖ్య అతిథులుగా రానున్నారు. చాలా ఏళ్ల తర్వాత బాలకృష్ణ, ఎన్ టిఆర్‌లు ఒకే వేదికపై కనిపించనున్నారన్న సమాచారం తెలియగానే నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో బాలకృష్ణ నటించిన ‘సింహా’ సినిమాకు సంబంధించిన కార్యక్రమానికి ఎన్ టిఆర్ విచ్చేసి సందడి చేశారు. ఇప్పుడు అబ్బాయి నటించిన ‘అరవింద సమేత’ చిత్ర విజయోత్సవ సభలో బాబాయ్‌ ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.మరోపక్క బాలకృష్ణ-కల్యాణ్‌రామ్‌లు ఎన్ టిఆర్ బయోపిక్ చిత్రంలో కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హరికృష్ణ పాత్రను కల్యాణ్‌రామ్‌ పోషిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన పోస్టర్‌కు విశేష స్పందన వస్తోంది.

Aravinda sametha movie success event on sunday