Home తాజా వార్తలు ‘అరవింద సమేత’ పబ్లిక్ టాక్…?

‘అరవింద సమేత’ పబ్లిక్ టాక్…?

Aravinda Sametha veera raghava Public Talk

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్ టిఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సెన్సెషనల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అరవింద సమేత’ గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ చూసిన ప్రేక్షకులు కొందరు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలిపారు. ఇక టీజర్, ట్రైలర్ లతో సినిమాపై భారీ అంచనాలు పెంచేసిన తారక్, త్రివిక్రమ్ లు వాటిని అందుకునేందుకు శతవిధాల ప్రయత్నించారనేది ప్రేక్షకుల టాక్. మాటల మాంత్రికుడు తన శైలికి భిన్నంగా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో మూవీ తెరకెక్కించారు. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు ఎదురుచూశారు. వాళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఇవాళ మూవీ విడుదలైంది. వారం రోజుల ముందుగానే నందమూరి అభిమానుల్లో దసరా పండుగ సెలబ్రేషన్స్ తీసుకొచ్చింది. అభిమానులు మూవీ చాలా బాగవచ్చిందని, తారక్ మరోసారి నటవిశ్వరూపం చూపించాడని చెబుతున్నారు.

ముఖ్యంగా ప్రతినాయకుడు జగపతి బాబు, ఎన్ టిఆర్ ల మధ్య వచ్చే సన్నివేశాలు అదిరిపోయాయట. తారక్ ఫ్యాన్స్ తొలి 20 నిమిషాలు మాత్రం అస్సలు మిస్ కావద్దంటున్నారు. అలాగే త్రివిక్రమ్ డైలాగ్స్, థమన్ పాటలతో పాటు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సూపర్బ్ గా ఉందని, పోరాట దృశ్యాల్లో తారక్ చించేశాడని పొగిడేస్తున్నారు. సినిమాటోగ్రఫీ మూవీని ఓ రేంజ్ లో నిలబెట్టిందంటున్నారు. అభిమానులు బ్లాక్ బస్టర్ అంటూంటే.. మరో వర్గం అభిమానులు మాత్రం ఎబోవ్ యావరేజ్ తో సరిపెడుతున్నారు. ఇక ట్వీట్ల విషయానికి వస్తే… ‘దమ్ముకు ఎక్కువ మిర్చికి తక్కువ’, ‘గురూజీ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్ మిస్’, ‘ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ అదిరిపోయిందని’, ‘ఫస్ట్ 30 నిమిషాలు సూపర్, ఇంటర్వెల్ బ్యాంగ్ తో పాటు క్లైమ్యాక్స్ కూడా చాలా బాగుందంటూ’ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి మూవీకి పాజిటివ్ టాక్ రావడం, పండుగా సీజన్ కావడం, విద్యార్థులకు దసరా సెలవులు కావడంతో ‘అరవింద సమేత’కు ఎదురు ఉండక పోవచ్చని సినీ విశ్లేషకుల అభిప్రాయం.

https://twitter.com/MA_Aravind/status/1050225755114729475