Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘అరవింద సమేత’ మోషన్‌ పోస్టర్‌..!

Aravindha Sametha Motion Poster Released

హైదరాబాద్: యంగ్‌ టైగర్‌ ఎన్ టి ఆర్‌ ఈరోజు(ఆదివారం) తన 35వ పుట్టినరోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘అరవింద సమేత..వీర రాఘవ’ చిత్ర మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూటిన్ కొద్దిసేపటి క్రితం విడుదల చేసింది. తారక్ కు ఇది 28వ చిత్రం. మాటల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నాడు. ఈ చిత్రానికి అర‌వింద స‌మేత అనే టైటిల్ ఫిక్స్ చేసి శనివారం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇందులో తారక్ మాస్ లుక్‌లో సిక్స్ ప్యాక్‌తో క‌నిపించాడు. రాయల‌సీమ బ్యాక్‌గ్రౌండ్‌లో ఈ సినిమా తెర‌కెక్కుతుందని సమాచారం. ఎన్ టి ఆర్‌ సరసన తొలిసారి పూజా హెగ్డే  హీరోయిన్ గా నటిస్తోంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ మూవీకి యంగ్ తరంగ్ ఎస్ఎస్. థ‌మ‌న్ బాణీలు అందిస్తున్నాడు. వచ్చే దసరాకు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం తాజాగా విడుదలైన ‘అరవింద సమేత..వీర రాఘవ’ చిత్ర మోషన్‌ పోస్టర్‌పై మీరు ఓ లుక్కేయండి.

Comments

comments