Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

దసరాకే రాబోతున్నాడు

Jr NTR,Trivikram film titled Aravindha Sametha

ఎన్‌టిఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ను దసరా సీజన్‌లో విడుదల చేసేందుకు ఫిల్మ్‌మేకర్స్ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. కానీ ఎన్టీఆర్ నాన్నగారు నందమూరి హరికృష్ణ ఆకస్మిక మరణంతో ఈ స్టార్ హీరోకు పెద్ద కష్టం వచ్చింది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో సినిమా షూటింగ్‌లో తారక్ పాల్గొనడం కష్టమని దాంతో సినిమా విడుదలను వాయిదా వేస్తారని మీడియాలో ప్రచారం సాగింది. ఇప్పటికే డెడ్‌లైన్స్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా టీమ్‌కు కొత్త ఇబ్బంది రావడంతో ఇక ‘అరవింద సమేత…’ దసరా పండుగకు రావడం కష్టమేనని అనుకున్నారు. నిర్మాత రాధాకృష్ణ కూడా విడుదలను వాయిదా వేసేందుకు ముందుకు వచ్చారట. కానీ ఎన్‌టిఆర్ మాత్రం తన వల్ల సినిమా రిలీజ్ వాయిదా వేయాలనే ఆలోచన వద్దని శనివారం నుండే తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. దశదిన కర్మ రోజు తప్ప మరో సెలవు లేకుండా షూటింగ్‌లో పాల్గొనాలని ఎన్‌టిఆర్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు త్రివిక్రమ్ కూడా తారక్ ఆలోచనకు తగ్గట్టే సెప్టెంబర్ చివరిలోపే షూటింగ్ మొత్తం పూర్తిచేసేలా ఒక యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేశాడట. ఇక నిర్మాతలు ముందుగా అనుకున్న సమయానికే ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. అక్టోబర్ 10 లేదా 11న సినిమా విడుదలవుతుందని టాక్.

Comments

comments