Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

‘అరవింద సమేత’ టీజర్ వచ్చేసింది…

Aravindha Sametha Official Teaser out now

హైదరాబాద్: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్ టిఆర్ కాంబోలో వస్తున్న తాజా మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. స్వాతంత్ర్య దినోవత్సవం సందర్భంగా కొద్దిసేపటి క్రితం చిత్ర టీజర్ ను విడుదల చేశారు. మరోసారి తారక్ నట విశ్వరూపం చూపించాడు. తనదైన డైలాగ్ డెలవరీతో అదరగొట్టాడు. కంట ప‌డ్డావా క‌నిక‌రిస్తానేమో, వెంట‌ప‌డ్డానా న‌రికేస్తా అంటూ ఎన్ టిఆర్ చెప్పిన డైలాగ్ అభిమానుల రోమాలు నిక్క‌పొడుచుకునేలా చేస్తున్నాయి అలాగే తారక్‌ కత్తి పట్టుకుని పరిగెడుతున్న తీరు పాత ఎన్ టిఆర్ ను మరోసారి గుర్తుచేస్తోంది. ‘మండు వేసవి గొంతులో దిగితే ఎట్టుంటదో తెలుసా? మచ్చల పులి ముఖం మీద గాండ్రిస్తే ఎలా ఉంటదో తెలుసా? మట్టి తుఫాను చెవిలో మోగితో ఎట్టుంటాదో తెలుసా?’ అని జగపతిబాబు చెప్తున్న డైలాగ్‌ ఆకట్టుకుంది. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ మూవీని హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. తారక్ కు జోడిగా పూజా హెగ్డే నటిస్తుంది. దసర కానుకగా మూవీ ప్రేక్షకుల ముందుకు విడుదల కానుంది.

Comments

comments