Home IPL 2018 అవును.. నేరం చేశాను…!

అవును.. నేరం చేశాను…!

Arbaaz Khan confesses to IPL Betting

ముంబయి: బాలీవుడ్ ఖాన్‌త్రయంలో ఒకరైన కండలవీరుడు సల్మాన్‌ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపిఎల్ మ్యాచ్‌ల్లో బెట్టింగ్‌కు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. శనివారం థానే పోలీసుల ఎదుట విచారణకు హాజరైన అర్బాజ్ తన నేరాన్ని అంగీకరించాడు. బుకీ సోను జలన్, అర్బాజ్ మధ్య జరిగిన చాటింగ్ సమాచారంతో పాటు బుకీలతో కలిసి వీరిద్దరు దిగిన ఫోటోలు తమ వద్ద ఉన్నట్లు థానే పోలీసులు వెల్లడించారు. 2017 ఐపిఎల్ మ్యాచ్‌లోనూ బెట్టింగ్ కట్టి రూ. 2.80 కోట్లు పొగొట్టుకున్నట్లు అర్బాజ్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. 5 గంటలకు పైగా పోలీసులు అర్బాజ్‌ను విచారించారు. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు. విచారణ అనంతరం బయటకు వచ్చిన అర్బాజ్ మాట్లాడుతూ… పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పానని, భవిష్యత్తులో కూడా పోలీసులకు పూర్తిగా సహకరిస్తానన్నారు.