Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

అద్భుత నక్షత్రం..!

Moon1

అమెరికన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నాసావారి హబుల్ టెలిస్కోపు సుమారు 1200 కాంతి సంవత్సరాల దూరంలోని ఓ నక్షత్రాన్ని గుర్తించింది. ఆ నక్షత్రం నుంచి ప్లాస్మా స్థితిలోని గోళాకారపు పదార్థం గంటకు 8,00,000 కి.మీ వేగంతో ప్రతి ఎనిమిదిన్నర సంవత్సరాలు వెలువడుతున్నది. ఈ ప్లాస్మా గోళాలు దాదాపు మార్స్ గ్రహానికి రెట్టింపు ద్రవ్యరాశిని కలిగివున్నాయి.

వీటి వేగం కేవలం 30 నిమిషాలలో మనం భూమి నుంచి చంద్రుడిని చేరుకునేంత వున్నది.ఓ నక్షత్రం తన అంతిమ స్థితిలో వున్నప్పుడు ఇలా శకలాలను వెలువరించవచ్చుననే విషయం తెలిసినా, మొట్టమొదటిగా దృశ్యరూపంలో చూస్తున్నామని శ్రీ రాఘవేంద్ర సహాయ్ నాసా జెట్ ప్రొపల్షన్ ప్రయోగశాల నుంచి తెలిపారు.

వారి మాటల్లోనే ….వాటి వివిధ దశల్లోని మార్పుల గురించి చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఈ మార్పులు సుమారు 200- 1000 సంవత్సరాల కాల వ్యవధిలో జరుగుతూ వుండవచ్చునేమో! (ఈ కాస్మిక్ కాలంలో కేవలం లిప్తపాటు మాత్రమే సుమా) స్పెక్ట్రోస్కోపీ సహాయంతో మనం ఒక నక్షత్రపు ఉష్ణోగ్రత , దాని వేగం, ఉనికి, కదలికలను అంచనా వేయవచ్చు.

ఈ విషయాలను ఆస్ట్రో ఫిజికల్ (Astro physical) జర్నల్ ఈ ఏడాది వెలువరించింది.

Comments

comments