అవును అయితే YES
కాదు అయితే NO
అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.
రైతులు కష్టపడి పండించిన మిర్చి పంటకు సరైన ధర లేకపోవడంతో ప్రభుత్వ అలసత్వాన్ని సహించలేక ఇటీవల ఖమ్మం మార్కెట్ యార్డ్ లో రైతులు ఆగ్రహ్యం వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డ్ లోని కార్యాలయంలో ప్రవేశించి సామాగ్రి ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. దీంతో ప్రభుత్వం రైతులపై కేసులు నమోదు చేసింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు రైతుల చర్యలను సమర్థిస్తున్నారు. మరికొందరు రైతులు అలా చేసుండకూడదని కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. రైతులు తమ కష్టానికి తగ్గ ఫలితం రావడంలేదని తమ ఆవేదనను విధ్వంసం రూపంలో వ్యక్తపరచడం సమంజసమేనని, కాబట్టి ప్రభుత్వం వారిపై పెట్టిన కేసును ఎత్తేయాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై మన తెలంగాణ వెబ్ సైట్ తన పాఠకులు, వీక్షకులనుండి అభిప్రాయాన్ని సేకరిస్తోంది.
మరి మీరేమంటారు?