Search
Wednesday 14 November 2018
  • :
  • :

అండర్-19 జట్టులో అర్జున్ టెండూల్కర్

arrjun-tendulkhar

ముంబయి: క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ భారత అండర్-19 జట్టుకి ఎంపికయ్యాడు. వచ్చే నెలలో భారత జట్టు 2 నాలుగు రోజుల మ్యాచ్‌లను శ్రీలంకతో ఆడనుంది. అయితే తాజా శ్రీలంక పర్యటనలో వన్డే జట్టుకు అర్జున్‌ను పక్కకుపెట్టిన సెలక్టర్లు.. నాలుగు రోజుల మ్యాచ్‌కు ఎంపిక చేసిన జట్టులో మాత్రమే చోటిచ్చారు. ‘అర్జున్ టెండూల్కర్ చాలా కష్టపడే క్రికెటర్. నేర్చుకునేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. అతనిలో బాగా నచ్చే అంశం ఏంటంటే..? కోచ్‌గా ఏదైనా చెప్తే.. తూచ తప్పకుండా పాటిస్తాడు’ అని అర్జున్ కోచ్ బెనర్జీ ప్రశంసించాడు. 2017-18లో ముంబయి అండర్-19 జట్టుకి ఆడిన అర్జున్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.

Comments

comments