Home తాజా వార్తలు రూ. 5లక్షలు పలికిన సచిన్ కుమారుడు

రూ. 5లక్షలు పలికిన సచిన్ కుమారుడు

Arjun tendulkarముంబై: భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబై టీ20 లీగ్ వేలం పాటలో రూ.5 లక్షలు పలికాడు. లీగ్ రెండో సీజన్ కోసం శనివారం జరిగిన వేలంలో ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ యాజమాన్యం అర్జున్‌ను రూ.5 లక్షలకు కొనుగోలు చేసింది. కనీస ధర రూ.లక్షతో వేలంలోకి ప్రవేశించిన ఈ జూనియర్ టెండూల్కర్ ను తొలుత నార్త్‌ముంబై పాంథర్స్ జట్టు 5 లక్షలకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చింది. ఆ తరువాత ఆకాశ్ టైగర్స్ ముంబై వెస్టర్న్ సబర్బ్ అర్జున్ ను దక్కించుకుంది. సచిన్ బ్రాండ్ అంబాసీడర్‌గా వ్యవహరిస్తున్న ముంబై టీ20 లీగ్ ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో ఐపిఎల్ ఆడుతున్న స్టార్ క్రికెటర్లు సూర్యకుమార్ యాదవ్, సిద్దేశ్ లా డ్, పృథ్వీషా, శ్రేయస్ అయ్యర్ లు కూడా బరిలోకి దిగుతుండటం విశేషం.

Arjun tendulkar Picked for 5 Lakhs in Mumbai T20 League Auction