Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ముంబయి అండర్-19కు జట్టుకు అర్జున్ టెండూల్కర్

Arjun-Tendulkar

ముంబయి: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. బరోడాలో జరుగనున్న జేవై లిలీ ఆల్ ఇండియా అండర్19 ఆహ్వానిత వన్‌డే టోర్నమెంటుకు అర్జున్‌ను ఎంపిక చేశారు. ఇటీవల ముంబయి అండర్14, అండర్16 జట్ల తరపున ఆడాడు. అండర్ 19 టోర్నమెంటు ఈ నెల 16 నుంచి 23 వరకు జరుగనుంది. దక్షిఫ్రికాతో టెస్టు మ్యాచ్‌కు ముందు గత జులైలో ఎడమచేతి వాటం కలిగిన అర్జున్ తన బౌలింగ్ శైలితో తొలి యార్కర్‌ను వేసి ఇంగ్లాండ్ వికెట్ కీపర్, బ్యాట్స్‌మన్ జానీ బెయిర్‌స్టోను కంగుతినిపించాడు. అదేవిధంగా మహిళల ప్రపంచ కప్‌కు ఫైనల్‌కు ముందు కూడా నెట్ ప్రాక్టీస్‌లో మిథాలీసేనకు బౌలింగ్ వేస్తూ కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే.
ముంబయి అండర్19 జట్టు సభ్యులు
అగ్ని చోప్రా, దివ్యాన్ష్ సక్సేనా, భూపేన్ లాల్‌వని, అంజ్‌దీప్ లాడ్, సాగర్ చబరియా, షోయబ్ ఖాన్, సత్యాలక్ష జైన్, వేదాంత్ ముర్కర్, దృవ్ బ్రిడ్, తనుష్ కొటియన్, నకుల్ మెహతా, ఫర్హాన్ ఖజి, అతర్వ అంకోలేకర్, అభిమన్యు వాశిస్థు, అర్జున్ టెండూల్కర్, సాక్షమ్ పర్సార్, సాక్షమ్ ఝా, సైల్వెస్టర్ డిసౌజా.

Comments

comments