Search
Saturday 22 September 2018
  • :
  • :

నేటి నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు

నేటి నుంచి 17 వరకు సాయుధ పోరాట వారోత్సవాలు ఇల్లందులో ప్రారంభం

Untitled-1

ఖమ్మం: తెలంగాణ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో సువర్ణక్షరాలతో లిఖించ దగిన చారిత్రాత్మక ఘట్టం. “బాంచన్ దొర” అంటూ బతుకుతున్న సామాన్యుడిని సాయుధుడిని చేసిన పోరాటం అది. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారు. అనేక మంది త్యాగాలకు ఒడిగట్టారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ భవిష్యత్తు కర్తవ్యాన్ని నిర్ధేశించుకునేందుకు తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 11 నుంచి 17వరకు సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహించ నున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఖమ్మం జిల్లా ప్రజలు మహోన్నత పాత్ర నిర్వర్తించారు. జిల్లాలో ప్రతి ఊరు, ప్రతి పుట్ట తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నవే. ఇప్పటికీ ఆ జ్ఞాపకాలు ప్రజల మదిలో పదిలంగా ఉన్నాయి.

నాటి పోరాట ఘట్టాలను నేటి తరానికి తెలియ జెప్పేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) సాయుధ పోరాట వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయి ంచింది. సభలు, సమావేశాలు నిర్వహించిన అమరుల చరిత్రలను వివరించనున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు తెలిపారు. నేటి నుండి ఇల్లందులో ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈనెల 17 వరకు తెలంగాణ వారోత్సవాలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని విముక్తి దినం సందర్భంగా గ్రామ గ్రామాన జాతీయ జెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వారోత్సవాలను పురస్కరించుకుని అమరుల ఆశయ సాధనకు కృషి చేస్తామని పార్టీ శ్రేణులు ప్రతిన బూననున్నట్లు హేమంతరావు తెలిపారు.

Comments

comments