ఢిల్లీ : గత ముప్పై ఏళ్లలో తాను ఒక్క సినిమా కూడా చూడలేదని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పైవిధంగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి హిందీ సినిమాలపై రావత్ అభిప్రాయాన్ని అడిగారు. దీంతో సినిమాలపై ఆయన స్పందించారు. సినిమా కోసం మూడు గంటల సమయం వెచ్చించే తీరిక తనకు దొరకలేదని ఆయన చెప్పారు. విద్యార్థులకు ఆయన సలహాలు, సూచనలు ఇచ్చారు. విద్యార్థి దశ నుంచే కష్టపడి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని ఆయన చెప్పారు. భవిష్యత్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు సైన్యంలో చేరుతారని ఆశిస్తున్నట్టు ఆయన తెలిపారు.