Home తాజా వార్తలు కశ్మీర్‌లో సైన్యం కౌంటర్ ఆపరేషన్

కశ్మీర్‌లో సైన్యం కౌంటర్ ఆపరేషన్

 

ARMY

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులను అడ్డుకునేందుకు భారత సైన్యం కౌంటర్ ఆపరేషన్ చేపట్టింది. షోపియాన్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జిల్లా పరిధిలోని దంగమ్, వాంగమ్, జైనపోరా, మంత్రిబగ్ సహా పలు ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేస్తున్నట్టు సైన్యం తెలిపింది. ఈ జిల్లాలో ఉగ్ర కదలికలు ఉన్నట్టు నిఘా వర్గాలు సమాచారం ఇవ్వడంతో ఈ తనిఖీలు చేపట్టారు. ఇప్పటి వరకు అనుమానించతగ్గ వ్యక్తులు కనిపించలేదని సైన్యం వెల్లడించింది. అయినా తాము తనిఖీలు చేస్తున్నామని సైన్యాధికారులు వెల్లడించారు.

Army counter operation in Kashmir