Home తాజా వార్తలు ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాన్

ఆర్మీ మేజర్‌ను కాల్చి చంపిన జవాన్

GUN

యురి సెక్టార్: ఆర్మీ మేజర్ ను ఓ యువ సైనికుడు కాల్చి చంపిన ఘటన ప్రస్తుతం భారత సైన్యంలో కలకలంగా మారింది. ఆకస్మిక తనిఖీల్లో భాగంగా సోదాలు నిర్వహిస్తున్న మేజర్ శిఖర్ థాపాకు ఫోన్ వాడుతూ కనిపించాడో సైనికుడు. దాంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం ఒకరిపై ఒకరు చేయిచేసుకునేంత వరకు వెళ్లింది. ఈ వివాదం కాస్తా ముదరడంతో కోపోద్రిక్తుడైన సదరు యువ సైనికుడు తన సర్వీస్ రివాల్వర్ తో మేజర్ పై రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు.

దీంతో ఆర్మీ మేజర్ శరీరంలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దాంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలాడు. కాగా, మృతుడు శిఖర్ థాప 71వ ఆర్మ్డ్ రెజిమెంట్ కు చెందినవారని, ప్రస్తుతం 8వ రాష్ట్రీయ రైఫిల్స్ లో పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన మంగళవారం యురి సెక్టార్ లోని బుచర్ పోస్టు వద్ద చోటుచేసుకుంది.

Army Major Shikhar Thapa shot dead by jawan in the Uri sector.