Home నిజామాబాద్ మే 21 నుండి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్

మే 21 నుండి 31 వరకు ఆర్మీ రిక్రూట్‌మెంట్

army

మన తెలంగాణ/ ఇందూరు: ఆర్మి రిక్రూట్‌మెంట్ ర్యాలీ  మే 21 నుండి 31వ తేది వరకు వరంగల్‌లో జవహర్‌లాల్ స్టేడియంలో నిర్వహించనున్నందున ఆసక్తి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం. రామ్మోహన్‌రావు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చునని ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్  6 నుండి మే 5 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్ ద్వారా మే 9వ తేదిన ఏ తేదిన ఇంటార్వులు హజరయ్యే వివరాలను అడ్మిట్ కార్డు ద్వారా తెలియజేస్తారని ఈ కార్డు ఆన్‌లైన్‌లో తీసుకోవాలని అన్నారు. రిక్రూట్‌మెంట్‌కు సంబంధించిన  పూర్తి వివరాలను ఆర్మీ కాడంగ్ సికింద్రాబాద్ 040-… 2774059కు సంప్రదించవచ్చునని కావాల్సిన అభ్యర్థులు తమరు మోబైట్ గూగుల్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని లైవ్‌చాట్ ద్వారా దరఖాస్తును పరిశీలన చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాకు సంబంధించిన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు.