Home తాజా వార్తలు వరంగల్‌లో ఆర్మీ నియామక ర్యాలీ

వరంగల్‌లో ఆర్మీ నియామక ర్యాలీ

ARMY3వరంగల్ : ఆర్మీలో వివిధ విభాగాలలో ఉద్యోగాల నియామకాల కోసం వరంగల్ జిల్లా కేంద్రంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ ప్రశాంతంగా కొనసాగుతోంది. హన్మకొండలోని జేఎస్‌ఎస్ మైదానంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ కరుణ , వరంగల్ నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈనెల 14వరకు జరిగే ఈ ర్యాలీలో బుధవారం మూడు వేల మంది అభ్యర్థులు పాల్గొన్నారు. 1600 మీటర్ల ర్యాలీలో అభ్యర్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా వెయ్యి పోస్టులకు గాను 29,500 మంది అభ్యర్థులు పలు విభాగాల్లో ఉద్యోగాల కోసం ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.