Home వరంగల్ మూడో రోజుకు చేరిన ఆర్మీ రిక్రూట్‌మెంట్

మూడో రోజుకు చేరిన ఆర్మీ రిక్రూట్‌మెంట్

Army Recruitment rally is the third day

మనతెలంగాణ/ వరంగల్ స్పార్ట్ : వరంగల్ అర్బన్ జిల్లా జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియం వేదికగా నిర్వహిస్తున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ గురువారానికి మూడవ రోజుకు చేరుకుంది. అర్ధరాత్రి 12 గంటల కు ప్రారంభమైన ర్యాలీ 4వేల మందికి అభ్యర్ధులు హాజరు కానుండగా 2541మంది అభ్యర్ధులు హజరు కాగా అందులో నుంచి 246 మంది అభ్యర్ధులు మెడికల్ టెస్టుకి అర్హత సాధించారు. నేడు రిక్రూట్‌మెంట్‌కు హాజరైన సోల్జర్ ట్రెడ్స్‌మెన్ ఉద్యోగాలకు గాను నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సం గారెడ్డి, సిద్దిపేట, సూర్యపేట,వికారాబాద్, వనపర్తి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, యాదాద్రి, నల్లగొండ జిల్లాలకు చెందిన అభ్యర్ధులు హాజరైనారు.
సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నా అభ్యర్ధులు : ఆర్మీ ర్యాలీలో పాల్లొనేందుకు వివిధ జిల్లాల నుంచి వచ్చిన అభ్యర్ధులకు జిల్లా యంత్రాంగం సరైన వసతులు కల్పించక పోవడంతో అభ్యర్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే జిల్లా యంత్రాంగం ఆర్మీ రిక్రూట్‌మెంట్ అభ్యర్ధులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని యూత్ హస్టల్, టెన్నిస్‌కోర్టు, కుడా భవన్‌లలో వసతులు ఏర్పాటు చేశామని తెలిపిన అధికారులు ఆ దిశగా వసతులు కల్పించకపోవడంతో అభ్యర్ధులంత బస్టాండ్ సర్కిల్‌పై ఉన్న గార్డెన్‌లో పడుకుంటున్నారు. అయితే అభ్యర్ధులకు ఎలాంటి మంచి నీటి సదుపాయం, మరుదోడ్లు అందుబాటులో లేకపోవడంతో అభ్యర్ధులంత నానా తంటాలు పడుతున్నారని చెప్పక తప్పదు. అదే విధంగా గత నెల రోజుల నుంచి ఆర్మీ ర్యాలీకై ఏర్పాట్ల పరీశిలించిన అధికారులు సరైన వసతులకు అందించక పోవడంలో విఫలమైనట్లు కోంత మంది అభ్యుర్ధులు అవేదన వ్యక్తం చేశారు.