Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య

 Arrabelli Dayakar Speech About Govt School Education

మన తెలంగాణ/దేవరుప్పుల : తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది మెరుగైన విద్యనందిస్తున్నామని స్థానిక ఎమ్మేల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటలో భాగంగా శుక్రవారం మండలంలోని చిన్నమడూర్ గ్రామంలో జరిగిన కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను, గ్రామస్థులను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతుందని, శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే విద్యా బోధన జరుగుతుందని తెలిపారు. పేద విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారన్నారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు, డిజిటల్ తరగతుల బోధన, సన్నబియ్యంతో కూడిన పౌష్టికాహార మధ్యహ్న భోజనం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి లాంటి ప్రభుత్వ పాఠశాలలను అందరూ బలోపేతం చేయాలని కోరారు. బడి బయట ఉన్న పిల్లలందరిని బడిలో చేర్పించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యా యులు గ్రామంలో చైతన్య ర్యాలీ చేపట్టారు.
అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే …
చిన్నమడూర్ గ్రామంలో ఫార్మెషన్ రోడ్డు పనులకు, గ్రామ కుమ్మరికుంటలో నాల్గవ విడత మిషన్ కాకతీయ పనులను ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో పాలకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపడమే ధ్యేయమని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వ మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తీగల దయాకర్, గ్రామ సర్పంచి మేడ సునిత, నాయకులు సోమనర్సయ్య, బిక్షపతి, సంఘమేశ్వర్, జోగయ్య తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు పరామర్శ…
మండలంలోని పలు గ్రామాలలో ఇటీవల మృతి చెందిన టిఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు శుక్రవారం పరామర్శించి అర్థిక సహాయం అందించారు. సీతరాంపురం గ్రామానికి చెందిన అంబటి ఎల్లమ్మ మరణించగా మృతదేహానికి పూలువేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టిఆర్‌ఎస్ కార్యకర్తల కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బస్వ మల్లేష్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తీగల దయాకర్, నాయకులు రెడ్డిరాజుల, హన్మంతు, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments