Home కుమ్రం భీం ఆసిఫాబాద్ ప్రాదేశిక ఓట్ల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు…

ప్రాదేశిక ఓట్ల కౌంటింగ్‌కు పకడ్బందీ ఏర్పాట్లు…

Territorial Votes

 

రిటర్నింగ్ అధికారులకు శిక్షణ
జెసి రాంబాబు

ఆసిఫాబాద్ : జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు 2019 కౌంటింగ్ సందర్బంగా రిటర్నింగ్ అధికారులు , పర్యవేక్షకులకు శుక్రవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో సంయుక్త పాలనాధికారి పి. రాంబాబు కౌంటింగ్ పై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపిటీసీ లెక్కింపు తర్వాత జడ్పీటీసీ లెక్కింపు ఉంటుందని ఎన్నికల ప్రక్రియలో ఓట్ల లెక్కింపు అతి ముఖమైన ఘట్టమని రిటర్నింగ్ అధికారి పర్యవేక్షనలో పోటీ చేయఅభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో లెక్కింపు జరుగుతుందన్నారు. కౌంటింగ్ జూన్ 4వ తేదిన ఉవదయం 8గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

లెక్కింపు సిబ్బంది , అభ్యర్థులు వారి ఏజెంట్లకు కౌంటింగ్ హాలును ఏర్పర్చుకుకోవాలని, ప్రతి ఎంపీటీసీ రెండు చొప్ప (ఉదాహరణకు ఒక మండలంలో 10 ఎంపీటీసీ నియోజక వర్గాలుంటే 20 ఏర్పాటు చేయాలని, ప్రాథమిక వివరణాత్మక లెక్కింపు రెండు కలిపి 8 రౌండ్లలో పూర్తయ్యే విధంగా సాయంత్రం 5గంటలలోపు పూర్తయ్యేలా సమాచారాన్ని ఎప్పటికప్పుడు కంప్యూటరీకరించడానికి టి పోల్ వెబ్‌సైట్ లో ఆదునీకరించడానిక తగు ఏర్పాటు చేయాలని, అలాగే రౌండ్ల వారి ఫలితాల ప్రకటనకై పెద్ద డిస్లే బోర్డు ఏర్పాటు చేసుకోవాలన్నారు.

ఒక పర్యవేక్షకుడు, ఇద్దరు సహాయక సిబ్బంది ఉంటారని, వీరికి గుర్తింపు కార్డు జారీ చేయడం జరుగుతుందని, కార్డు లేని వారిని కౌంటింగ్ హోలులోకి అనుమతించబడదన్నారు. సంబందిత పోలింగ్ కేంద్రం అధికారులు నిర్ధారించుకున్న తర్వాతనే బ్యాలెట్ బాక్సుబయలకు తీయాలని, బ్యాలెట్ బాక్సులు తెరవడానికి ముందు హాజరైన అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో జరుగుతుందన్నారు. రిటర్నింగ్ అధికారులు లెక్కింపు పూర్తయిన తర్వాత పారం 16లో తుది ఫలితాలు ప్రతిని పూర్తి చేసి సంతకం పెట్టాలన్నారు. ఎంపీడీఓలు, ఆర్‌ఓలు బాధ్యతగా ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని పకడ్బందిగా నిర్వహించాలని సూచించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ కలెక్టర్ హేమంత్ , లైసన్ అధికారి వెంకట శైలేష్, ఎంపీడీఓలు, ఆర్‌ఓలు, సిబ్బంది పాల్గొన్నారు.

Arrangements for Counting Territorial Votes