Home పెద్దపల్లి ‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు

‘రైతుబంధు’ చెక్కుల పంపిణీకి ఏర్పాట్లు

'farmers'-checks-image

మన తెలంగాణ / పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఈ నెల 10 నుండి 17 వరకు నిర్వహించనున్న  రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు  జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన తెలిపారు. పెద్దపల్లి కలెక్టర్ కార్యాలయ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో లక్షా 27 వేల 7వందల ముప్పైమూడు మంది ఖాతాదారులకు 103కోట్ల 28లక్షల 52వేల 5వందల ఇరవై రూపాయలను లక్షా 28వేల 2వందల ఎనభ్బై చెక్కుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. చెక్కులతోపాటుగా పట్టాదారు పాస్‌బుక్‌లను అందించనున్నట్టు పేర్కొన్నారు. ఎం డ  తీవ్రత మూలాన ఉదయం 7గంటల నుండి 11గంటల వరకు, సాయంత్రం 5గంటల నుండి 7గంటల వరకు పంపి ణీ కార్యక్రమాన్ని రెండు విడతలుగా ఏర్పాటు చేశామన్నారు. ఇందుకు 94 బృందాలను మానిటరింగ్ చేసేందుకు మండలానికి ఒకరు చొప్పున 14మంది నోడల్ ఆషీసర్‌లను నియమించినట్టు తెలిపారు. ఒక్కో సెంటర్‌లో  ఆధార్ వెరిఫికేషన్,గ్రీవేన్స్‌సెల్ మొదలగు 4 విభాగాలను ఎర్పాటు చేయడం జరిగిందని రైతలకు ఎమైనా ఇబ్బంది ఉంటె సంబందిత గ్రీవెన్స్ సెల్‌లో ఫిర్యాదు చేయాలని అన్నారు. రైతులకు చెల్లించిన చెక్కులకు సంబందించి నగదు నిల్వలు బ్యాంకులలో ఉన్నాయని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. పెద్దపల్లి డీసీపి సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ రైతు బంధు చెక్కుల పంపిణి సెంటర్ల వద్ద అవసరమయిన బందో బస్తు ఎర్పాటు చేసినట్టు తెలిపారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకొని ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోనున్నట్టు ఆయన పేర్కొన్నారు. సమస్యాత్మక గ్రామాలలో ఎస్సై నుండి ఎసీపి వరకు అధికారులను నియమించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈకార్యక్రమానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఆర్‌డివో అశోక్ కుమార్,ఎసీపి హబీబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.