Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

కరుడుగట్టిన దొంగల అరెస్ట్

Arrest of hacked thieves

ఖమ్మం క్రైం: పగలు, రాత్రి దొంగతనాలే లక్షంగా చేసుకుని జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సిపి తఫ్సీర్ ఇక్బాల్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. జూన్ 1న ఖమ్మం సిసిఎస్, ఖమ్మం రూరల్ పోలీసులు సంయుక్తంగా కోదాడ క్రాస్‌రోడ్ సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో అక్కడ అనుమానస్పదంగా కనిపించిన ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. జిల్లా వ్యాప్తంగా పగలు రెండు, రాత్రి సమయంలో ఐదు, సాధారణంగా మరో రెండు చోరీలకు పాల్పడినట్టు వారు విచారణలో అంగికరించారు. నిందితుల్లో గుంటూరు జిల్లా మంగళగిరి గ్రామానికి చెందిన పెండ్రా పెద్ద వెంకటేశ్వర్లు ప్రస్తుతం చేసిన దొంగతనాలతోపాటు గుంటూరు జిల్లాలో సైతం సుమారు 30 చోరీ కేసులో నిందితుడిగా ఉన్నాడు. ఖమ్మం జిల్లా వైరాకు చెందిన ఉప్పు తిరుపతి కూడా మరో ఆరు కేసుల్లో నిందితుడు. కృష్ణా జిల్లా తిరువూరు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన నల్లమోతుల సురేష్ అలియాస్ ఎర్రోడు సుమారు 50 చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ ముగ్గురిపై సంబంధిత సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి నుంచి సుమారు రూ.9.50 లక్షల విలువైన 28 తులాల బంగారం, 5 తులాల వెండి ఆభరణాలు, ద్విచక్ర వాహనాన్ని స్వాధినం చేసుకున్నారు. కేసును ఛేదించిన సిసిఎస్ ఎసిపి ఈశ్వరయ్య, సిఐ కరుణాకర్‌లను సిపి ప్రత్యేకంగా అభినందించి రివార్డు అందజేశారు. రివార్డు అందుకున్న వారిలో ఎస్‌ఐ ఆనందరావు, ఎఎస్‌ఐ లింగయ్య, హెడ్‌కానిస్టేబుల్ డానియల్, రమేష్, కానిస్టేబుల్ శ్రీనివాస్, శ్రీనివాసరావు, సత్యనారాయణలు ఉన్నారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డిసిపి కొల్లు సురేష్ కుమార్, సిసిఎస్ ఎసిపి ఈశ్వరయ్యలు పాల్గొన్నారు.

Comments

comments