Search
Wednesday 14 November 2018
  • :
  • :

గంజాయి చాక్లెట్‌లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్…

Arrested man selling marijuana chocolates

బాలానగర్: గంజాయి చాక్లెట్‌లు విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ అయిన సంఘటన బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.  ఎక్సైజ్ సిఐ తెలిపిన వివరాల ప్రకారం… బాలానగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ పాన్‌షాప్ యజమాని అజయ్ గంజాయి చాక్లెట్‌లు విక్రయిస్తున్నాడన్న విశ్వసనీయ సమాచారం మేరకు పాన్‌షాప్‌పై దాడి చేసి అతని వద్ద నున్న 105 చాక్లెట్ లను స్వాధీనం చేసుకుని అతడిని అదుపులోకి తీసుకుని విచారించాగా, అజయ్ చాక్లెట్‌లను ఒడిశా నుండి దిగుమతి చేసుకుని విక్రయిస్తున్నట్టు తెలియజేశాడు. కేసు నమోదు చేసుకుని అజయ్‌ని రిమాండ్‌కు తరలించినట్టు బాలానగర్ సిఐ. జీవన్ కిరణ్ తెలిపారు.

Comments

comments