Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

కొత్తిమీరతో కీళ్ళనొప్పులు మాయం

కొత్తిమీరను సాధారణంగా వివిధ రకాల ఆహార పదార్థాల తయారీలోనూ,  గార్నిష్‌కూ ఎక్కువగా ఉపయోగిస్తాం. ఇది ఒక శక్తివంతమైన ఆకుకూర. ఇది దాదాపు అన్ని రకాల వంటలలోనూ ఉపయోగిస్తాం.  దీనిని తేలిక పాటి మిరియాలతో కలిపి వాడితే మంచి టేస్ట్ కూడా వస్తుంది. కొత్తిమీరలో థియామైన్ తో సహా అనేక ఖనిజాలు,   విటమిన్లు సమృద్ధిగా ఉన్నాయి. 

coriader

ఈ మొక్కనుండి తీసిన విత్తనాలను ధనియాలు అంటారు. ధనియాలను కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలకు వాడతారు. ధనియాల కషాయం దగ్గు, జలుబులకు చికిత్సగా మంచి పరిష్కారంగా ఆయుర్వేద వైద్యులు సూచిస్తారు. కొత్తిమీర వాసన ఎంతో బాగుంటుంది. ధనియాలు కషాయంగా వాడి, దగ్గు, జలుబు, జ్వరం వంటివి తగ్గించి శరీరానికి మంచి చల్లదన్నాన్ని కలిగించవచ్చు పచ్చని, ఆకులు, పచ్చని పండ్లతో వుంటుంది అవి పక్వానికి వస్తే గోధుమరంగులోకి తిరుగుతాయి.
కొత్తిమీర రుచి, సువాసనతో పాటు అనేక ఆరోగ్యప్రయోజనాలు చేకూరుస్తుంది. ఇది అనేక వ్యాధుల చికిత్సలోఉపయోగిస్తుంది. కొవ్వు, మినరల్స్, పీచు, కార్బొహైడ్రేట్స్ ఉంటాయి. ఈ కూర చాలా తక్కువ ధరలోనే లభిస్తుంది. విటమిన్ సి,ఎ, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, నియాసిన్, సోడియం, పొటాషియం, ఆగ్జాలిక్ యాసిడ్స్ ఉంటాయి. పొట్ట గడబిడ లేకుండా చేస్తుంది. లివర్ సక్రమంగా పనిచేయడానికి, డయేరియా కంట్రోల్ చేయడానికి ఉపయోగిస్తుంది. చర్మాన్ని కాపాడడానికి వాడే రసాయన మందులలో కొత్తిమీర ఆకులను వాడతారు. ముఖం మీద మచ్చలు పోగొడుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేస్తుంది. ఒత్తిడి నుండి దూరం చేస్తుంది. ఎనీమియా రాకుండా కాపాడుతుంది. యాంటీ సెప్టిక్ లక్షణాలు, గాయాలను మాన్పుతుంది.
జీర్ణవ్యవస్థను పెంచి అజీర్ణం, వాంతులు లాంటివి తగ్గిస్తుంది.రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గిస్తుంది. కళ్ళకు అలసట లేకుండా చేస్తుంది. ఇది కీళ్ళనొప్పులు రాకుండా కాపాడుతుంది.

Comments

comments