Home లైఫ్ స్టైల్ అందమైన బీచ్‌ల సముదాయం..

అందమైన బీచ్‌ల సముదాయం..

sea

అందమైన బీచ్‌ల సముదాయం.. అండమాన్ నికోబార్ దీవులు

అండమాన్, నికోబార్ దీవులు పరిశుభ్రమైన ఇసుక బీచ్‌ల సముదాయాలు. థాయ్‌లాండ్, సింగపూర్‌ల వలే పెద్ద మార్పులు లేకుండా ఏడాదంతా ఒకే విధమైన వాతావరణం కలిగి ఉండే దీవులు అండమాన్, నికోబార్‌లు. అక్టోబర్ నుంచి మే వరకు వీటిని చూడటానికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో ఇక్కడ వార్షిక పర్యాటక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సమయంలో వర్షాలు పడి వాతావరణం ఆహ్లాదరకంగా ఉంటుంది. సెలవుల విహార ప్రదేశం. సుమారు 8000 చదరపు కిలోమీటర్లకు పైగా విస్తీర్ణం కలిగి, అనేక ప్రకృతి దృశ్యాలతో అలరారుతోంది. ఈ ప్రదేశం భారతదేశానికి దక్షిణ దిశగా చివరి భాగంలో ఉండటమే కాదు, బంగాళాఖాత సముద్రంలో మనకు ఒక కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంటూ అతి పెద్ద కోస్తా తీరం కలిగి ఉంది. అండమాన్, నికోబార్ అనే ఈ రెండు ద్వీపాలు పది డిగ్రీల ఉత్తర అక్షాంశంతో వేరు చేయబడుతూ, రెండు విడి విడి ద్వీపాలుగా ఉన్నాయి. మరి ఈ ద్వీపాలను చేరాలంటే, పోర్ట్ బ్లెయిర్ లోని ప్రత్యేక విమానాశ్రయం ద్వారా వెళ్ళవలసిందే. ద్వీపాలన్నిటిలోను పోర్ట్ బ్లెయిర్ అధిక జనసాంద్రత కలిగి ఉంటుంది. ఉత్తరం నుండి దక్షిణ దిశగా ఈ ద్వీపాలు నీటిలో ఎత్తైన పర్వత శ్రేణులతో సుమారు 800 కిలో మీటర్ల వరకు వ్యాపించి ఉంటాయి.
చూడాల్సిన ప్రదేశాలు..స్కూబా డైవింగ్, నీటి లోపలి లోతులను అన్వేషించాలన్నా, మొక్కలు, జంతువుల సంపదలను తెలుసుకోవాలనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. దీవులలో అతి విశాలమైన దట్టమైన అరణ్యాలు ఉన్నాయి. వీటిలో వందలాది విభిన్న జాతుల పక్షులు, పూలు వంటివి ప్రత్యేకించి హనీమూన్ జంటలకు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. పర్యాటకుల కోసం స్థ్ధానికులు చేసే ఏర్పాట్లు పర్యావరణ స్నేహపూరితంగా ఉండి, నగరాలకు దూరంగా ఉంటూ కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, వెలు తురు, నీరు మొదలైనవి అందిస్తాయి. ఇప్పటికీ ఇక్కడి అడవులలో సుమారు 2200 మొక్క జాతులు గుర్తించబడ్డాయి. వీటిలో సుమారు 1300 జాతుల వరకు మన భారత ప్రధాన భూభాగం కలిగి ఉంది. అండమాన్, నికోబార్ దీవులు అలంకరణకు ప్రసిద్ధి గాంచిన షెల్ ఫిష్ లేదా ఓస్టర్లకు అతి పెద్ద మార్కెట్. వేసవి సెలవులకు ఈ ద్వీపాలు ప్రధాన విశ్రాంతి నిలయాలు. హేవ్ లాక్ ద్వీపంలోని రాధానగర్ బీచ్‌ను పేరొందిన టైమ్ మేగజైన్ వారు ఇటీవల ఆసియాలోనే అతి గొప్పదైన బీచ్ గా వర్ణించారు.
కాలుష్యరహితం..అండమాన్ లో విశ్రాంతి సెలవులు అంటే చాలు పర్యాటకులు జాలీబాయ్ చూసేందుకు ఇష్టపడతారు. జాలీబాయ్ ద్వీపం పక్కనే కల హేవ్ లాక్ దీవి , సింకే దీవి లతో కూడా కలిపి మహాత్మ గాంధీ మెరైన్ నేషనల్ పార్క్ ఉంది. దీన్ని వాండూర్ మెరైన్ నేషనల్ పార్క్ అని కూడా అంటారు. కాలుష్యం ఏ మాత్రం లేకుండా నియంత్రణ చేయటం వల్ల, స్వచ్ఛమైన, నిర్మలమైన వాతావరణం కారణంగా ఈ ప్రాంతాన్ని పర్యాటకుల స్వర్గంగా చెప్పవచ్చు. ఇక్కడి జలచరాల జీవనం, స్వచ్ఛమైన అనేక పగడపు దిబ్బలు, మొక్కలు, జంతు శ్రేణులు వంటివి ఇక్కడ మాత్రమే లభిస్తాయనడంలో అతిశయోక్తి లేదు…

చేరుకోవటం ఎలా?

sae1

అండమాన్, నికోబార్ ద్వీపాలను చేరుకోవటం చాలా తేలిక. భారతదేశంలోని అనేక ఎయిర్ లైన్ సంస్థలు పోర్ట్ బ్లెయిర్ విమానాశ్రయం అయిన వీర సావర్కార్ విమానాశ్రయానికి కోల్ కతా, భువనేశ్వర్, చెన్నైల నుండి తమ విమానాలను నడుపుతున్నాయి. ఖ్యాతిగాంచిన ఓడ రవాణా సంస్థ షిప్పింగ్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎం.వి. నాన్కోవరీ అనే ఓడను చెన్నై , పోర్ట్ బ్లెయిర్ ల మధ్య నెలకు రెండు సార్లు , విశాఖ పట్లణం నుండి పోర్ట్ బ్లెయిర్ కు మూడు నెలలకు ఒకసారి నడుపుతోంది.
ఈ ప్రాంత ఉష్ణోగ్రతలు సాధారణంగా 24 డిగ్రీల నుండి 32 డిగ్రీ సెల్సియస్ వరకు మారుతుంటాయి. చలికాలంలో ఒకటి లేదా రెండు డిగ్రీలు తగ్గుతాయి. వాతావరణం ఏదైనప్పటికీ అండమాన్ నికోబార్ దీవులలో తేమ అధికంగా ఉంటుంది.