Home లైఫ్ స్టైల్ తలరాత మారుస్తున్న ‘రాత’

తలరాత మారుస్తున్న ‘రాత’

గ్రాఫాలజీలో మేటి తెలంగాణ  సమిత

అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన ప్రతిష్టాత్మక అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్(ఎఎహెచ్‌ఎ) కన్వెన్షన్ 2018 అవార్డు హైదరాబాద్‌కు చెందిన గ్రాఫాలజిస్ట్ సమితా పాండ్యాకు దక్కింది. ఇప్పటికే సమిత ఈ అవార్డును రెండు సార్లు గెలుచుకుంది. అమెరికా వెళ్లిన గ్రాఫాలజిస్ట్‌ల్లో మొట్టమొదటి ‘సర్టిఫైడ్ కర్సివ్ ట్రైనర్ కోచ్’ ఈమె. మాతృభాష నుండి వేరువేరు భాషల్లో మాట్లాడటానికి, రాయడానికి సలహాలు, సూచనలు ఇస్తోంది.

ph

ఆంగ్లంతోపాటు హిందీ, తెలుగు, తమిళం, గుజరాతీ భాషల్లో కూడా రాయడంలో, మాట్లాడటంలో సలహా చెప్తోంది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్‌లో తన పనికి గుర్తింపు పొంది సభ్యత్వం పొందిన మహిళగా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో నిలిచింది. యుఎస్, కెనడా, ఇంగ్లాండ్‌ల నుండి మొత్తం 30 మంది నిపుణులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఎఎహెచ్‌ఎ మార్గదర్శకాల ప్రకారం గ్రాఫాలజిస్టుల వ్యక్తిగత అనుభవాల దృష్టా కొత్తప్రాంతాలకు విస్తరించటమే ధ్యేయంగా పెట్టుకుంది. ఈ సంస్థ స్థాపన తరువాత చాలా గ్రాఫాలజీ పుస్తకాలలో మార్పులు వచ్చాయి. డయాగ్నస్టిక్ గ్రాఫాలజీ, డాక్యుమెంటరీ సాక్షం, వ్యక్తుల ఎంపికలో కాంగ్రెస్ వర్గీకరణ వ్యవస్థలో దశాంశ వర్గీకరణ పద్ధతిలో పుస్తకాలను నిర్వహిస్తున్నారు. కొత్త తరహా నిర్వహణ ద్వారా పాల్గొనేవారు సెషన్ల సమయంలో చాలా ఎక్కువ నేర్చుకోగలగుతారు. అక్షరాలకి మించిన ఆయుధాలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చేతిరాత ధోరణులు, చేతిరాత గ్రాఫాలజీ, డిస్‌గ్రాఫియా చూడటం ద్వారా తెలుసుకోవచ్చని పాండ్యా చెప్పింది. ఇంగ్లీషుతో పాటు వేరొక భాషకి సంబంధించిన గ్రాఫాలజీ విషయంలో పరిశోధనల ఫలితాలను బట్టి అందరిలోకి పిన్న వయసు స్పీకర్‌గా సమిత పాండ్యా అవార్డు అందుకుంది. ఇంగ్లిషు, గుజరాతీ, సంస్కృతం, హిందీ, తెలుగు, తమిళం, ఉర్దూ…ఈ 7 భాషల దస్తూరీలను ఎనలైజ్ చేస్తుంది.
గ్రాఫాలజీ అంటే దస్తూరీని బట్టి వ్యక్తి మనస్తత్వాన్ని అంచనా వేయటం ఒక్కటే కాదు. వ్యక్తుల్లోని మానసిక రుగ్మతలు, వాటి స్థితులు, తీవ్రతలను కనిపెట్టొచ్చు. వ్యక్తిత్వ లోపాలను తెలుసుకోవచ్చు. అదే దస్తూరీకి చిన్న మార్పులు సూచించి మానసిక వ్యాధులను సరిదిద్దవచ్చు. ఇప్పుడు నేను అదే చేస్తున్నానంది.
దస్తూరీని బట్టి వాళ్లకున్న సమస్యలు, ఒత్తిడిలు, బలహీనతలను కనిపెట్టి వాటి తీవ్రతను తగ్గించటం కోసం కొన్ని డిజైన్లను ఇచ్చి వాటిని ప్రాక్టీస్ చేయమని చెప్తుంది. ఈ చికిత్సను ‘గ్రాఫోథెరపీ’ అంటారు. రాతకు మన చేయి ఓ సాధనం మాత్రమే. అసలు కిటుకంతా మన మెదడులో ఉంటుంది. కాబట్టి ఆ మెదడులో ఎలాంటి ఒత్తిడి, గందరగోళం ఉన్నా చేతిరాత మారిపోతుంది. అలా మెదడుకు, చేతికి ఉన్న కనెక్షన్‌ను ఆధారంగా చేసుకుని అదే దస్తూరీకి కొన్ని మార్పులు చేయటం, కొత్త రకంగా గీతలు గీయించటం ద్వారా మెదడులో తలెత్తే ఆలోచనల్లో మార్పులు తీసుకురావొచ్చు. గ్రాఫాలజీ ఈ సూత్రం ఆధారంగానే పని చేస్తుందని సమితా పాండ్యా తన గ్రాఫాలజీ ప్రాముఖ్యతను వివరించింది.
గత పది సంవత్సరాల్లో వేలమందికి ఒత్తిడి నుండి దూరమవటానికి శిక్షణ ఇచ్చింది. దస్తూరీని బట్టి వాళ్లకున్న సమస్యలు, ఒత్తిడిలు, బలహీనతలను కనిపెట్టి వాటి తీవ్రతను తగ్గించటం కోసం కొన్ని డిజైన్లను ఇచ్చి వాటిని తిరిగి రాయమని చెపుతుంది. ఈ కన్వెన్షన్ ద్వారా ప్రతి ఒక్కరిలో మెరుగైన భవిష్యత్తు, వృత్తిపరమైన అవగాహన కలిగిస్తున్నామంది. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు చేతిరాతలో శిక్షణ ఇస్తోంది. చిన్నప్పటినుంచే అక్షరాల్లో కనిపించే తేడాల్ని సరిదిద్దించగలిగితే వాళ్ల మానసిక ఎదుగుదల సజావుగా సాగుతుంది. ఇందుకోసం తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లన్నీ సందర్శిస్తూ పిల్లల మంచి భవిష్యత్తుకు పునాదులు వేస్తోంది.
కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్, బండారు దత్తాత్రేయ, దర్శకులు కె. విశ్వనాథ్, హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ వామనరావు, బాలీవుడ్ యాక్టర్ బోమన్ ఇరానీ…ఇలా ఎంతోమంది ప్రముఖుల దస్తూరీలను అనలైజ్ చేసి సూచనలు చేసింది. బండారు దత్తాత్రేయ సిగ్నేచర్ అమ్మాయి అని పాండ్యాని పిలుస్తారట. జీవితంలో కష్టాలు, కుంగుబాట్లు సహజం. గ్రాఫాలజీ లక్ష్యాన్ని చేరుకోవాలనే పట్టుదల, వాటన్నిటినీ ఎదుర్కోగల ధైర్యాన్నిస్తుంది. సాధారణ గృహిణిగా ఉన్నా గ్రాఫాలజిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకోగలగటానికి తోడ్పడింది ఆ పట్టుదలే అంటోంది సమితా పాండ్యా.