Home కెరీర్ భారత రాజ్యాంగం- చట్టాలు

భారత రాజ్యాంగం- చట్టాలు

students

ఇండియన్ పాలిటీ సిలబస్
రాజ్యాంగాభివృద్ధి చట్టాలు, రాజ్యాంగ పరిషత్ నిర్మాణము, రాజ్యాంగ పరిషత్ కమిటీలు, రాజ్యాంగ ఆధారాలు, రాజ్యాంగ ముఖ్యలక్షణాలు, రాజ్యాంగ విభాగాలు, షెడ్యూళ్లు, ప్రవేశిక, రాజ్యాంగ సవరణ పద్ధతి, ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశిక సూత్రాలు, కేంద్రరాష్ట్ర సంబంధాలు, కేంద్రప్రభుత్వం, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ, రాజ్యసభ, ప్రధానమంత్రి, మంత్రిమండలి, భారత న్యాయవ్యవస్థ (సుప్రీం, హైకోర్టులు), రాష్ట్రప్రభుత్వం, గవర్నర్, శాసనసభ, శాసనమండలి, ముఖ్యమంత్రి, మంత్రిమండలి, స్థానిక స్వపరిపాలన వ్యవస్థ (పంచాయతీరాజ్ వ్యవస్థ ః 73 వ రాజ్యాంగ సవరణ; నగర పాలక వ్యవస్థః 74వ రాజ్యాంగ సవరణ) ముఖ్య రాజ్యాంగ సవరణలు.
భారత రాజ్యాంగం ః రాజ్యాంగం అనే భావనను ప్రపంచానికి అందించిన తత్వవేత్త అరిస్టాటిల్, అరిస్టాటిల్ రాసిన రాజ్యాంగం గురించి వివరించిన ప్రధాన గ్రంథం పాలిటిక్స్. పాలిటిక్స్ గ్రంథాన్ని 158 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి రాశాడు. పాలిటిక్స్ గ్రంథం వివరిస్తున్న అంశాలు ఎ) రాజ్యాంగ విధానం బి) ప్రభుత్వాల వర్గీకరణ సి) శాస్త్రీయ ప్రభుత్వ విధానం.
రాజ్యాంగం నిర్వచనాలు 1. ఒక దేశ ప్రజల జీవన విధానాన్ని తెలియచేయు లిఖిత పూర్వక అంశమే రాజ్యాంగం అరిస్టాటిల్
2. వ్యక్తిపాలన కంటే చట్టబద్ద (రాజ్యాంగ బద్ద) పాలన శ్రేష్టమైంది అరిస్టాటిల్

భారత రాజ్యాంగాభివృద్ధి చట్టాలు ః 1. రెగ్యులేటింగ్ చట్టం 1773ః భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడానికి బ్రిటిష్ పార్లమెంట్ రూపొందించిన చట్టం ఇది.
ముఖ్యాంశాలు ఈ చట్టం మొట్టమొదటిసారిగా కంపెనీకి సంబంధించిన రాజకీయ, పరిపాలనా అంశాలను గుర్తించింది.
* ఇండియాలో కేంద్రప్రభుత్వ విధానానికి పునాదులు పడ్డాయి.
* బెంగాల్ గవర్నర్‌ను “గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌”గా మార్చారు.
నోట్ ః మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ నియమించబడిన వ్యక్తి వారన్ హేస్టింగ్స్.
* గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్‌కు పాలనలో సహకరించడానికి నలుగురు సభ్యులతో కూడిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఆవిర్భవించింది.
* స్వతంత్రంగావున్న బొంబాయి, మద్రాసు ప్రెసిడెన్సీలు బెంగాల్ గవర్నర్ జనరల్ పరిధిలోకి తేబడ్డాయి.
* 1774లో కలకత్తాలోని సెయింట్ విలియం కోటలో మొట్టమొదట సుప్రీంకోర్టు ప్రారంభించారు. ఈ కోర్టు ఒక ప్రధాన న్యాయమూర్తి, ఇద్దరు న్యాయమూర్తులను కలిగి ఉండేది.
* ప్రప్రథమ ప్రధాన న్యాయమూర్తి గుర్ ఎలిజా ఇంపే
* కంపెనీ వ్యవస్థలో బానిస విధానాన్ని రద్దు చేశారు, ఈస్టిండియా కంపెనీ సొంత వ్యాపారం చేసుకోడానికి వీలు లేదు.
* ఈస్డిండియా కంపెనీ ఇండియాలో జరిపే రెవెన్యూ, సివిల్, ఆర్మీ లావాదేవీలన్నింటిపై కోర్టు ఆఫ్ డైరెక్టర్స్‌కు నివేదిక సమర్పించాలి.
పిట్స్ ఇండియా చట్టం 1784ః రెగ్యులేటింగ్ చట్టంలోని లోపాలను సవరించడానికి ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. దీన్ని రూపొందించింది విలియం పిట్.
ముఖ్యాంశాలు ఈ చట్టం ఈస్టిండియా కంపెనీ యొక్క పరిపాలన కార్యనిర్వహణ విభాగాలను రెండింటిని వేరు చేశారు. వీటిపాలనకు రెండు సంస్థలను ఏర్పాటు చేశారు.
1. కోర్టు ఆఫ్ డైరెక్టర్స్ కంపెనీ వ్యాపార వాణిజ్య విషయాలపై నియంత్రణ కల్గి ఉంటుంది.
2. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఇండియాలో కంపెనీకి సంబంధించిన సాధారణ పరిపాలనా వ్యవహారాలను ఆరుగురు సభ్యులతో కూడిన ఈ కౌన్సిల్ చూస్తుంది. ఈ చట్టం ద్వారా ఇండియాలో ద్వంద్వ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు.

* ప్రపంచంలో మొట్టమొదటి లిఖిత రాజ్యాంగం ః అమెరికా రాజ్యాంగం
* ప్రపంచంలో మొట్టమొదటి అతి చిన్న రాజ్యాంగం ః అమెరికా రాజ్యాంగం
* ప్రపంచంలో అత్యంత దృఢ రాజ్యాంగం ః అమెరికా రాజ్యాంగం
* ప్రపంచంలో అలిఖిత రాజ్యాంగానికి ఉదా ః బ్రిటన్
* ప్రపంచంలో పరిణామాత్మక రాజ్యాంగానికి ఉదాహరణ : బ్రిటన్ రాజ్యాంగం
* ప్రపంచంలో విప్లవ మూలక రాజ్యాంగానికి ఉదాహరణ ః అమెరికా, రష్యా, ఫ్రాన్స్
* ఆమోదిత రాజ్యాంగానికి ఉదాహరణ ః ఇండియా రాజ్యాంగం
* ప్రసాదిత రాజ్యాంగానికి ఉదాహరణ ః డెన్మార్క్

చార్టర్ చట్టం 1793 :
ఈస్టిండియా కంపెనీ యొక్క వ్యాపార వాణిజ్య హక్కులు 20 సం॥ల కోసం నిర్ణయించారు.
చార్టర్ చట్టం 1813 :ఈ చట్టం కంపెనీ వ్యాపార హక్కులను మరో 20 సం॥లు పొడిగించింది.
ముఖ్యాంశాలు

* ఇండియాలో కంపెనీ గుత్తాధిపత్యాన్ని రద్దు చేసింది.
* ఇండియాలో స్వేచ్ఛా వాణిజ్య విధానాన్ని ప్రవేశపెట్టింది.
* ఇండియాలో ఉపయోగితావాద విద్యావ్యాప్తి కోసం ప్రతి సంవత్సరం ఒక లక్షరూపాయలు ప్రభుత్వం కేటాయించింది.
* ఇండియాలో మతవ్యాప్తికి క్రైస్తవ మిషనరీలను అనుమతించారు.
*ఇండియాలో భూములు కొనుగోలు చేయడానికి ప్రైవేటు వ్యక్తులకు కూడా హక్కు కల్పించారు.
* స్థానిక స్వపరిపాలనా సంస్థలలో పన్నులు విధించే అవకాశం, అధికారం కల్పించారు.
చార్టర్ చట్టం 1813 :
ఈ చట్టంలోని ముఖ్యాంశాలు ః

* బెంగాల్ గవర్నర్ జనరల్‌ను భారత గవర్నర్ జనరల్‌గా మార్చారు.
నోట్ ః భారత మొదటి గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్
* మొట్టమొదటి లా కమిషన్ ఏర్పాటుచేయండి.
నోట్ ః లా కమీషన్ మొదటి చైర్మన్ లార్డ్‌మెకాలే
* ఇండియాలో మొదటిసారిగా బానిస వ్యవస్థను రద్దు చేశారు .కాని లార్ట్ ఎలిన్ బరో వ్యతిరేకత వల్ల అమలు చేయలేదు.
* భారతీయులకు సివిల్ సర్వీస్ పరీక్షల యందు ప్రవేశం కల్పించారు.
కాని కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వ్యతిరేకత వల్ల అమలు నిలిచిపోయింది.
చార్టర్ చట్టం1813 :
* ఈస్టిండియా కంపెనీ పాలనా కాలంలో ప్రవేశపెట్టబడిన చివరి చార్టర్ చట్టం.
ముఖ్యాంశాలు

* గవర్నర్ జనరల్‌కు విస్తృత అధికారాలిచ్చారు.
* లెజిస్లేటివ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను వేరు చేశారు.
* ఇండియాలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వానికి పునాదులు వేయబడ్డాయి.
* భారతీయులకు జాతి వివక్ష లేకుండా సివిల్ సర్వీసు పరీక్షలయందు
అనుమతించారు.
విక్టోరియా మహారాణి ప్రకటన (1853)
* సిపాయిల తిరుగుబాటు ముగిసిన తరువాత ఈ చట్టం వచ్చింది,
* దీన్ని విక్టోరియా మహారాణి ప్రకటన లేదా ప్రథమ భారత ప్రభుత్వ చట్టం అని కూడా అంటారు.
ముఖ్యాంశాలు ః

* ఈ చట్టం ద్వారా ఇండియాలో ఈస్టిండియా కంపెనీ పాలన రద్దు చేయబడింది.
* భారతదేశం బ్రిటిష్ సామ్రాజ్యంలో అంతర్భాగమైంది.
* భారతదేశం బ్రిటన్ రాణి సార్వభౌమత్వంలోకి పోయింది.
* బ్రిటిష్ పార్లమెంటు స్వయంగా ఇండియాకు సంబంధించిన చట్టాలు రూపొందిస్తుంది.
* లండన్‌లో భారత రాజ్య కార్యదర్శి అనే పదవిని ఏర్పాటు చేశారు.
* లండన్‌లో భారత రాజ్య కార్యదర్శి బ్రిటన్ క్యాబినెట్‌లో భాగంగా బ్రిటన్ పార్లమెంటుకు బాధ్యత వహిస్తారు.
* భారత కార్యదర్శికి సలహాలివ్వడం కోసం 15మంది సభ్యులతో కూడిన కౌన్సిల్‌ను ఏర్పాటు చేశారు.
దీని మొదటి కార్యదర్శి చార్లెస్ ఉడ్స్.
భారత గవర్నర్‌జనరల్‌ను “వైస్రాయ్‌”గా మార్చారు.
మనదేశ మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్
* కంపెనీ పాలనా కాలంలోను, బ్రిటిష్ ప్రభుత్వం పాలన కాలంలోనూ పనిచేసిన అత్యున్నత ఏకైక అధికారి లార్డ్ కానింగ్
* భారత పాలనా వ్యవస్థలో క్రమానుగత శ్రేణిలో కేంద్రీకృత పాలనా వ్యవస్థను ప్రవేశపెట్టడం జరిగింది.
* ఈ చట్టాన్ని Good Governance in India చట్టంగా పేర్కొంటారు.
* విక్టోరియా రాణి ఈ చట్టాన్ని భారత ప్రజల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు
‘మాగ్నాకార్టా’ వంటిదిగా అభివర్ణించింది.
* టిబి మెకాలే ఈ చట్టాన్నిప్రాజ్ఞ నిరంకుశత్వాన్ని నెలకొల్పే చట్టంగా
అభివర్ణించింది.
కౌన్సిల్ చట్టం 1861ః 1859లో లార్ట్‌కానింగ్ కాలంలో మన దేశంలో ప్రవేశపెట్టిన పోర్ట్‌పోలియో విధానానికి చట్టబద్ధతను కల్పించారు.
పోర్ట్‌పోలియో ః ప్రభుత్వంలోని మంత్రిమండలి సభ్యులకు శాఖలను కేటాయించుటను ‘పోర్ట్‌పోలియో విధానం’ అంటారు.
* గవర్నర్ జనరల్‌కు ఆర్డినెన్సులను జారీచేయు అధికారం కల్పించారు.
* ఆర్డినెన్సు అనగా ఉత్తర్వు, దీనికి సాధారణ శాసనాలకున్నంత విలువ ఉండును.
* ప్రభుత్వానికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన సంవత్సర నివేదిక అయిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పద్ధతిని ప్రారంభించారు.
* కేంద్ర లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో మొదటిసారిగా భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. వారు. ఎ) పాటియాలా మహరాజు, బి) బెనారస్ మహరాజు సి) సర్.దినకర్‌రావు
బొంబాయి, మద్రాసుల యందు లెజిస్లేటివ్ కౌన్సిల్ లను ఏర్పాటు చేశారు.
కౌన్సిల్ చట్టం,
1892 ః ఈ చట్టం ద్వారా కేంద్ర శాసనసభలో భారతీయుల ప్రాతినిధ్యమును ‘ఆరు’కు పెంచటం జరిగింది. శాసనసభలో సభ్యత్వం పొందినవారు.
1. సురేంద్రనాథ్ బెనర్జీ
2. గోపాలకృష్ణ గోఖలే 3.దాదాబాయి నౌరోజీ 4.ఫిరోజ్ షా మెహతా
5.రాజ్‌బిహారీ ఘోష్ 6.బిల్‌గ్రామీ
కేంద్ర శాసనసభలో బడ్జెట్ మినహాయించి మిగిలిన పరిపాలనాఅంశాలపై ప్రశ్నించే అవకాశాన్ని కల్పించారు.
* మన దేశంలో మొదటిసారిగా ప్రతినిధుల ఎంపిక ప్రక్రియను
ప్రవేశపెట్టారు.
* ఆర్‌సి. మజుందార్ భారత జాతీయోద్యమాన్ని మూడు దశలుగా
వర్గీకరించారు.
1. మితవాద దశ (1885-1905)
2.అతివాద దశ (19051920)
3. గాంధీ దశ (1920 1947)
*1905 లో లార్డ్‌క్బ్రన్ బెంగాల్‌ను విభజించాడు.
*బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర ఉద్యమం, స్వదేశీ ఉద్యమం జరిగినవి.
*1906 లో ఢాకా నవాబు సలీముల్లా అలీ సోదరులు నేతృత్వంలో
“ముస్లింలీగ్‌” ఏర్పడినది.
*1907లో భారత జాతీయ కాంగ్రెస్‌లో అతివాదులు మితవాదుల మధ్యసూరత్ చీలిక ఏర్పడినది.

శెగ్గెం శంకర్, డైరెక్టర్,
శంకర్స్ స్టడీ సర్కిల్, హైదరాబాద్,
9000499234