Home ఎడిటోరియల్ దక్షిణాది వేగుచుక్క సర్వాయి పాపన్న

దక్షిణాది వేగుచుక్క సర్వాయి పాపన్న

హైదరాబాద్‌కు ఈశాన్యంగా 50 మైళ్ళ దూరంలో వరంగల్ ప్రధాన రోడ్డు, దానిని ఆనుకొని వున్న ఖిలాషాపూర్ ఈ రెండు బండగుర్తులు మరిచిపోయేవికావు. అది కొండదుర్గం గ్రామ మధ్యలో స్థిరంగావున్న ప్రదేశములోగల విగ్రహము. ఆ విగ్రహము అందరికీ చిరపరిచితుడు అయిన ఆ గ్రామానికి చెందిన సర్వాయి పాపన్నది.175080 మధ్యకాలంలో గల చిత్రము ఆధారముగా విగ్రహాన్ని చెక్కారు. వేసిన రంగు, విగ్రహములో తీవ్రమైన కంటిచూపు, భయంకరమైన మొనదేలిన మీసకట్టు ముంజేతిమీద డేగ చూపరులకే భయంకరంగా వుండి అతని ప్రవర్తనకు అద్దంపట్ట్టే విధముగా వున్నది. 1710లో మొగల్ రాచరికపు వ్యవస్థను మొగల్‌పాలకులను ఎదిరించి పోరాడిన యోధునిగా కీర్తించబడ్డాడు పాపన్న. 1709లో మొగలాయి సైన్యాలు పాపన్న అతని అనుచరులపై నాలుగు సార్లు భయంకర దాడులు చేసినాయి.ప్రత్యేకంగా విశ్లేషణ జరిగినచో భారతదేశమంతటా 18వ శతాబ్దములో కులం, తరగతి (వర్గము) మతం అనే అంశాలపై ఆధారపడి వున్నది. అదే విధముగా పాపన్న అనుచరులు విరోధులు వ్యతిరేకలు కూడా ఈ అంశములపైననే ఆధారపడి వున్నారు. పాపన్న కథ అదే విధానాన్నే పోలియున్నది. 16వ శతాబ్ది తొలి రోజుల్లో బహమనీ రాజ్యం 5 ప్రాంతీయ రాజ్యాలుగా విడిపోయే సమయంలో దాని సరిహద్దులు ఉత్తర చివరి భాగంలో బహుమనీ సామ్రాజ్యం ఆవల 1518 1687 మధ్య కుతుబ్‌షాహి గోలుకొండ సామ్రా జ్యం ఏర్పడింది. 1630 ప్రాంతంలో మొఘల్ సామ్రాజ్య నీలిమేఘాలు గోల్కొండ ఉత్తర ప్రాంతాన్ని చేరుకున్నాయి. షాజహాన్ తన పెద్ద కుమారుడైన ఔరంగజేబును దక్కన్‌లో రాచకార్యాలు చక్కబెట్టడానికి వైస్రాయిగా నియమించాడు.
1636లో వైస్రాయిగా నియమించబడ్డ ఔరంగజేబు మొదట వైస్రాయిగాను, ఆ తరువాత 1658 తరువాత చక్రవర్తిగాను 1707లో మరణించే వరకు 40 సంవత్సరాల కాలం డక్కన్‌లోనే నివశించాడు. పాపన్న కల్లుగీత (గౌడ) కులానికి చెందినవాడు. అతడు కులవృత్తిని అనుసరించడానికి అంగీకరించలేదు. కల్లుకుండ యిచ్చి పంపాలని భావించకు, నా చేయి కుండమీద పడదు. నా చేయి గోల్కొండ కోట గోడలమీద పడాలని అన్నాడు. పాపన్న జీవితంలో ప్రాథమిక విషయాలు మరో కోణం నుంచి తెలుస్తున్నాయి. మొఘల్ సామ్రాజ్య రాచరిక విధానానికి అనుకూలంగా వ్రాయబడుతున్న ఆధారాలు చైఫ్‌ఖాన్ రచనలు అన్నీ అధికారిక నివేదికలు ఆధారంగా వ్రాయబడిన ప్యూడల్ రచయితల ఆధారాలు. పాపన్న తాటికొండకు దగ్గరలో షాపూర్‌లో స్థిరపడ్డాడు. 1702లో రుస్తుదిల్ ఖాన్ అనే డిప్యూటీ గవర్నర్ షాపూర్ ప్రాంతంలో పాపన్న అనుచరులను సమూలంగా అణచివేయాలని తీర్మానించాడు. అదే సమయములో పాపన్న, అతని సైన్యం ఇరుగు పొరుగు కోటలను ఆక్రమించుకోవటం ప్రారంభించారు. పాపన్న ఆ సమయములో ప్రాంతీయ యుద్ధనాయకునిగా అభివృద్ధి చెందాడు. 1702 04 మధ్య గల రెండు సంవత్సరాలలో తెలంగాణ మధ్య ప్రాంతములోని అతని ప్రాబల్యము పెరిగింది. 1703 మే, 1705 డిసెంబరు మధ్య కాలములో రుస్తుందిల్‌ఖాన్ హైదరాబాద్‌కు బదిలీ చేయబడ్డాడు. ఖఫీఖాన్ నివేదికలో రుస్తుంఖాన్ పాపన్నని అణచివేయడానికి సమర్ధులైన సైన్యాన్ని నియమించినట్లు తెలిపాడు. పాపన్నమీద రెండవ ముట్టడి కూడా విఫలమైంది. ఈ సంఘటన తరువాత సంవత్సరానికి 1707లో రుస్తుందిల్ ఖాన్ వ్యక్తిగతంగా సామ్రాజ్య సైన్యాలతో పాపన్నను ఎదుర్కోవాలని నిర్ణయించాడు. పాపన్న వాటిని తిప్పి కొట్టాడు. మొగలాయి సైన్యం హైదరాబాద్‌కు తిరిగి వెళ్ళిపోయింది. ఈ చర్య పాపన్న అతని అనుచరులలో ధైర్యసాహసాలు పాదుకొలిపింది. మరింత ధైర్యంగా పథకాలు వేయడానికి అవకాశం కల్పించింది. 1707లో ఔరంగజేబు మరణించాడు. ఔరంగజేబ్ పెద్ద కుమారుడు బహద్దూర్ షా అన్నదమ్ములిద్దరిలో ఒకనిని ఓడించి సింహాసనాన్ని అధిష్టించాడు. ఆయన తనంత తానుగా పట్టాభిషేకం చేసుకొని కింగ్ ఆఫ్ గోల్కొండగా 1708 జనవరిలో మారాడు. మారుతున్న పాలనా విధానాలను నిశితంగా పాపన్న గమనిస్తున్నాడు. 1708 ఏప్రియల్ 1న అష్‌వీహ్ర వచ్చింది. మార్చి 31 సాయంత్రం పాపన్న అతని సైన్యము 2000 నుంచి 3000 మంది కాల్బలము 400 నుంచి 500 అశ్వకదళము వరంగల్ రాతికోటగోడ వద్దకు చేరుకున్నారు.
వరంగల్ ముట్టడి పాపన్న నుదటి రాతను మార్చి వేసింది. ఈ ఆక్రమణ తరువాత పాపన్న మచిలీపట్నం కేంద్రంగా వ్యాపారం చేస్తున్న డచ్, ఇంగ్లీషు వ్యాపారుల నుండి పెద్ద మొత్తంలో యుద్ధ సామగ్రి కొన్నాడు. వరంగల్ ముట్టడి విజయవంతమైన తరువాత పాపన్న వరంగల్‌కు సుమారు 30 మైళ్ల దూరంలో షాపూర్ వద్ద హైదరాబాద్ ప్రధాన రహదారిని ఆనుకొని ఏటవాలు కొండపై నిర్మింపబడిన భువనగిరి దుర్గాన్ని ఆక్రమించుకోవాలని పథకం వేసి ఆక్రమించాడు. హైదరాబాద్‌లో బహదూర్‌షా బహిరంగ దర్బారు నిర్వహించాడు. డచ్ రిపోర్టర్ తెల్పిన ఏకపక్ష నివేదిక ప్రకారము ఈ సందర్భంగా సర్వాయి పాపన్న ఒక స్వయంపాలకుడని చక్రవర్తి తెలుసుకున్నాడు. సామ్రాజ్య అధికారిక గుర్తింపు కొరకు చట్టబద్ధంగా, న్యాయసమ్మతంగా కొంత కప్పము చెల్లించి నాయకునిగా కొనసాగవచ్చునని చక్రవర్తి ప్రకటించగా పాపన్న బహదూర్‌షాకు 14 లక్షల రూపాయలు బహుమతిగా పెద్ద మొత్తంలో ఆహారధాన్యాలు యితర నిత్యావసర వస్తువులు సమర్పించాడు. ప్రతిఫలంగా చక్రవర్తి పాపన్నను గౌరవించటంతో పాటు గౌరవ ప్రదమైన దుస్తులను బహూకరించాడు. గోలుకొండకు రాజును చేశాడు. 1687 తరువాత హైదరాబాద్ నగరంలో యింతటి గౌరవ మర్యాదలు చక్రవర్తితో పొందిన సమకాలీన నాయకులు లేరు. కొన్ని పెత్తందారు కుటుంబాల వారు దానిని వ్యతిరేకించారు. అట్టి వారిలో తెలంగాణకు చెందిన వారు ఉన్నారు. వారు ఇంటీరియల్ కోర్టులో దావా వేశారు. ఆ కేసులో అతడు కల్లు గీయువాడు. అయినప్పటికీ అతనికి అతి పెద్ద గౌరవము యిచ్చారని ఆరోపింపబడింది. అతనిని నిరోధించమని బహదూర్‌షా హైదరాబాద్‌కు క్రొత్తగా నియమించిన గవర్నరు యూసఫ్ ఖాన్‌ను ఆదేశించాడు.1709లో పాపన్న ఇరుగుపొరుగు దుర్గాలను స్వాధీనం చేసుకోవాలని మొఘల్ సైన్యాన్ని తన నేలపై ఎదిరించి పోరాడటానికి సిద్ధమైనాడు.
తాటి కొండలో భయంకరంగా దాడి జరిగినా పాపన్న కొన్ని నెలల పాట ప్రతిఘటించగలిగాడు. చివరకు మేనెలలో పాపన్న అనుచరులకు గవర్నర్ అత్యధిక మొత్తం ఆశ చూపాడు. ఆ భయంకర పరిస్థితిలో గుర్తు పట్టకుండా పాపన్న వేషం మార్చాడు. కాలిజోళ్లు ఆయుధాలను కోట ఒక ద్వారము వద్ద వుంచి మరోద్వారము గుండా హుస్నాబాద్ గ్రామంలోని ఒక కల్లు మండువా వద్ద ఆశ్రయం పొందాడు. ఆ గ్రామానికి అతడు మేలు చేశాడు. కల్లు మండువాలో కూర్చొని వుండగా మొఘలు సైన్యం చుట్టుముట్టి పాపన్నను బంధించి గవర్నర్ ముందు నిలబెట్టింది. తరువాత అతనిని నరికివేశారు. పాపన్న తలను బహదూర్‌షా దర్బారుకు పంపారు. మొండేన్నిహైదరాబాద్ కోటగుమ్మానికి వేలాడదీసి ప్రజలలో భయం కల్గించాలని ఆదేశించారు. స్వయంపాలన కోసం ఉద్యమించిన మడమతిప్పని వీరునిగా చరిత్రలో నిలిచాడు సర్వాయి పాపన్న. గౌడ ఐక్యతా సాధన సమితి ఆధ్వర్యంలో పాపన్న స్ఫూర్తి యాత్ర ఆగస్టు 1న తాటికొండ నుండి తెలంగాణ ముఖ్య ప్రాంతాల్లో తిరుగుతూ 7వ తేదీ గోలుకొండలో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తుంది.

అంబాల
నారాయణగౌడ్
9949652024