Home ఎడిటోరియల్ మోడీ దౌత్య గడసాము

మోడీ దౌత్య గడసాము

PM Narendra Modi To Hold Pariksha Par Charcha With Students In Delhi Today

8 దేశాల షాంఘై సహకార సంస్థ (ఎస్‌సిఒ) సమావేశంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతవారం చైనా రేవు పట్టణం క్వింగ్‌డావో వెళ్లారు. క్యుబెక్ (కెనడా)లో జరిగిన జి.7 సమావేశానికి దాదాపు సమాంతరంగా ఈ సమావేశం జరిగింది. అమెరికా, ఐరోపా దేశాల నాయకత్వంలోని జి.7 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా, రష్యా నాయకత్వంలో ఎస్‌సిఒ ఏర్పడిందనటంలో రహస్యమేమీలేదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ రెండు గ్రూపులను పోల్చుతూ ఎస్‌సిఒకున్నఆధిక్యతను ఇలా తెలిపారు: “జి 7 దేశాల తలసరి ఆదాయం హెచ్చుగా ఉండవచ్చు. అయితే ప్రపంచ జనాభాలో 42 శాతం, ప్రపంచ జిడిపిలో 20 శాతం ఎస్‌సిఒలో ఉంది”.
న్యూఢిల్లీ అటు అమెరికన్ శిబిరంలో, ఇటు చైనా, రష్యా నాయకత్వంలోని గ్రూపింగ్‌లో ఉన్న దృష్టా, భారత్ ‘సమతులన చర్య’కు తిరిగి వచ్చిందని, ‘ రెండు గుర్రాలపై స్వారీ’ చేస్తున్నదని, ఎవరైనా వ్యాఖ్యానించవచ్చు. ఇందులో వ్యత్యాసం ఉంది. అయితే దాన్ని స్పష్టమైన భాషలో నిర్వచించాల్సి ఉంది. పరిమితులకులోబడిన అలీనత చట్రం నుంచి భారత్ బయటపడినట్లు కనిపిస్తున్నది. అయితే బ్యూరోక్రటిక్ జడ త్వం, తటపటాయింపు పాత ఆలోచనా పద్ధతులకు, పని చేసే తీరుకు బలం చేకూర్చుతుంది.
మోడీ విదేశాంగ విధానం ‘రెండు కాళ్లపై నడుస్తున్నట్లు’గా ఉంది. అన్ని ప్రధాన రాజ్యాలతో సంబంధాలు పెట్టుకోవటం, ఏ రాజ్యం అనుయాయిగా ఉండటానికి తిరస్కరించటంలో ఇది బహుశా స్పష్టమవుతున్నది. సొంత ప్రయోజనం, ఆత్మవిశ్వాసంపై కేంద్రీకరించిన విదేశాంగ విధానం కారణంగా ఏకకాలంలో అనేక రాజ్యాలతో సంబంధాల ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లోని వైరుధ్యాలతో నెగ్గుకురాగలుగుతున్నది. న్యూఢిల్లీ గతం లో విదేశాంగ విధాన సూత్రాలను ప్రబోధించగా, ఇప్పుడు ఆచరణాత్మకత ప్రదర్శిస్తున్నది. ఇందులో వైరుధ్యాలున్నాయి.
ఇండో పిసిఫిక్ ప్రాంతంలో చైనాను ఎదుర్కొనేందుకు ఉద్దేశించిన అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, భారత్‌లతో కూడిన క్వాడ్‌లో న్యూఢిల్లీ క్రియాశీల భాగస్వామికావటాన్ని, అదే సమయంలో బ్రిక్స్‌లో సభ్యురాలిగా ఉండటాన్ని, ఎస్‌సిఒలో 2017లో పూర్తిస్థాయి సభ్యురాలు కావటాన్ని ఎవరైనా ఎలా వివరించగలరు?
చైనా తలపెట్టిన బృహత్తర రోడ్డు (బిఆర్‌ఐ) ప్రాజెక్టులో చేరని ఏకైక దేశం భారత్ కావటం ఆసక్తిదాయకం. ఎస్‌సిఒలోని మిగతా ఏడు సభ్యదేశాలు దాన్ని ఆమోదించాయి. మోడీ ఇలా పునరుద్ఘాటించారు: “ఎస్‌సిఒ రీజియన్‌లో, మన ఇరుగు పొరుగు దేశాల్లో రవాణా సంబంధం భారత్‌కు ప్రాధాన్యత గలది. సమ్మిళితంగా, మన్నికగా, పారదర్శకంగా ఉంటూ దేశాల సార్వభౌమత్వం, భౌగోళిక సమగ్రతను గౌరవించే కొత్త రవాణా ప్రాజెక్టులను మేము స్వాగతిస్తాం”. 50 బిలియన్ డాలర్లతో తలపెట్టిన చైనా పాకిస్థాన్ ఆర్థిక నడవ పాకిస్థాన్ ఆక్రమణలోని గిల్గిత్, బాల్టిస్థాన్ ప్రాంతం గుండా వెళ్లటానికిది ప్రస్తావన. ఆ నడవను పిఒకె నుంచి పక్కకు మరల్చితే బిఆర్‌ఐ ప్రాజెక్టును భారత్ ఆమోదిస్తుందా? ఈ వ్యూహాత్మక ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు న్యూఢిల్లీ జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఒక బెల్ట్ ఒక రోడ్డు (ఒబిఒఆర్ బిఆర్‌ఐ) ద్వారా యూరప్, ఆఫ్రికాతో రహదారి సంబంధాన్ని, ఆ క్రమంలో పారిశ్రామిక వాణిజ్య కేంద్రాల అభివృద్ధిని చైనా తలపెట్టింది. ప్రపంచంలో అమెరికా ఆధిపత్యానికి ప్రత్యామ్నాయాన్ని అది కోరుకుంటున్నది. అటువంటి వ్యూహాత్మక పథకంలో భారత్ స్థానమెక్కడ!
ఎస్‌సిఒ సమావేశం జరిగిన నేపథ్యాన్ని గుర్తు చేసుకోవాలి. ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటం, రష్యాపై దాని ఆంక్షలు, చైనాతో వాణిజ్య వివాదం ఆ నేపథ్యం. ఆఫ్ఘనిస్థాన్, మంగోలియాలతోపాటు ఇరాన్ పరిశీలక సభ్యురాలిగా హాజరైంది. ఈ విషయాలను ఎస్‌సిఒ చర్చించటం, పరిస్థితిని ఎదుర్కొనేందుకు ప్రతి వ్యూహాలు రూపొందించటం సహజం. ఈ సమ్మిట్ నుంచి చైనా ఏమి పొందింది ట్రంప్ ప్రభుత్వంతో వాణిజ్య వివాదంలో బహుశా భారత్ తోడ్పాటు. చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ ఇలా ప్రకటించారు: “స్వార్థపూరితమైన, హ్రస్వదృష్టితో కూడిన, సంకుచితమైన, తలుపులు మూసుకునే విధానాలను మనం తిరస్కరించాలి. మనం డబ్లుటిఒ రూల్సును పరిరక్షించాలి, బహుళ స్థాయి వాణిజ్య వ్యవస్థను బలపరచాలి. బాహాట విశ్వ ఆర్థిక వ్యవస్థను నిర్మించాలి”.
అదలా ఉంచితే, ఎస్‌సిఒ సమ్మిట్ నుంచి భారత్ ఏమి పొందింది. ఎన్‌ఎస్‌జి అణు సరఫరాల గ్రూపులో తన ప్రవేశానికి చైనా తోడ్పాటు సంపాదించటానికి భారత్ కృషి చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో సంయుక్త ప్రాజెక్టుల అమలులో చైనా భాగస్వామ్యాన్ని అది సంపాదించింది. మూడు, తమ వాణిజ్యాన్ని ప్రస్తుత 84.4 బిలియన్ డాలర్ల నుంచి 2020 నాటికి 100 బిలియన్ డాలర్లకు పెంచుకునేందుకు బీజింగ్, న్యూఢిల్లీ అంగీకరించాయి. చక్కెర, బాస్మతియేతర బియ్యం దిగుమతికి, వాణిజ్య లోటు తగ్గించే నిమిత్తం తన పెట్టుబడుల పెంపుదలకు బీజింగ్ అంగీకరించింది. వ్యాపారాన్ని సులభతరం చేసేందుకై బ్యాంక్ ఆఫ్ చైనా ముంబయిలో తన బ్రాంచి తెరుస్తుంది. నాలుగు, మోడీ తన ప్రసంగంలో ఎస్‌సిఒ దేశాల నుంచి టూరిజం పెంపుదల గూర్చి మాట్లాడారు. సాంస్కృతిక సంబంధాలు పెంపొందించేందుకు బుద్ధిస్టు ఉత్సవం నిర్వహిస్తామన్నారు.
రవాణా సంబంధాల మెరుగుదలకు తన చొరవలను ప్రస్తావించారు ఇరాన్‌లో చాబహార్ రేవు అభివృద్ధి, అంతర్జాతీయ ఉత్తర దక్షిణ కారిడార్, ఇండియా, ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్, ఆర్మేనియా, అజర్‌బైజాన్, రష్యా, మధ్య ఆసియా,యూరప్ మధ్య సరకు రవాణాకు 720 కిలోమీటర్ల బహువిధ రవాణా ప్రాజెక్టు, అనేక గల్ఫ్, మధ్య ఆసియా దేశాల మధ్య రవాణా ఏర్పాటుకు ఉద్దేశించిన ఆష్గాబాత్ ఒప్పందం వాటిలో ఉన్నాయి. మనం ఇవాళ మళ్లీ భౌతిక, డిజిటల్ సంబంధం భౌగోళిక నిర్వచనాన్ని మార్చే బిందువు వద్ద ఉన్నాం అన్నారు. అటువంటి లక్షాలు చైనా, పాకిస్థాన్‌లకు నచ్చాయో, లేక నచ్చ చెప్పాలో తెలియదు. చైనా ‘ నూతన శక్తి’ ఆకాంక్షను భారత్ పరిగణనలోకి తీసుకోక తప్పదు. భారత్ ఏ మేరకు సమతుల్యం చేయగలుగుతుంది? చైనా విస్తరణ దృక్పథం భారత్‌కు ఇబ్బందిగా ఉన్నప్పుడు వివిధ వేదికల్లో చైనాతో సహవాసాని భారత్ ఎలా ముందుకు తీసుకెళుతుందో, ఇరుదేశాల నాయకుల మధ్య వ్యక్తిగత సంబంధాల ప్రభావం ఎలా ఉంటుందో కాలమే చెబుతుంది.
చైనా నాయకత్వంలో ఆసియాకు నిర్దుష్టమైన ప్రాంతీయ భద్రతా ఏర్పాటుకు స్థిరపడుతుందో లేక అంతర్జాతీయంగా పాత్ర వహిస్తుందో భారత్ నిర్ణయించుకోవాలి. భారత్ తన మౌలిక ప్రయోజనాలపై రాజీపడకుండానే, ప్రస్తుతం ప్రధాన వివాదాంశంగా ఉన్న బిఆర్‌ఐకి అంతిమంగా అంగీకరించవచ్చు. భారత్‌కున్న మార్గాంతరాలేమిటి? చైనాతో సన్నిహిత సహకారం వాంఛనీయం. భారత్, బీజింగ్‌ను విస్తృతమైన వాణిజ్య బంధంలో బిగించాలని, అది భద్రత రిస్క్‌లను తగ్గిస్తుందనేది ఒక ఆలోచనా ధార సూచిస్తున్నది. కాగా, “క్వాడ్‌” తదితర వ్యూహాత్మక భాగస్వామ్యాలతో చైనాకు ఎదురు నిలవాలన్నది తద్విరుద్ధమైన సూచన. అది దౌత్యానికి నిర్దుష్ట పరిస్థితికి సంబంధించిన విషయం. ఎందుకంటే, అంతర్జాతీయ రాజకీయాల్లో ఏదీ స్థిరం కాదు.