Home కెరీర్ అవకాశాలకు నిలయం ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్

అవకాశాలకు నిలయం ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్

lf

ఈ కోర్సు చదివే వారికి ఈ కింది అంశాలమీద అనుభవ పూర్వకమైన అవగాహన ఏర్పడుతుంది
* ఇంజనీరింగ్ ప్రిన్సిపల్స్, సైన్సెస్
* భవన నిర్మాణానికి సంబంధించిన హీటింగ్, కూలింగ్, వెంటిలేషన్ అంశాలు
* బిల్డింగ్ స్ట్రక్చురల్ ఎనాల్సిస్ అండ్ డిజైన్

* బిల్డింగ్ ఎలక్రికల్ పవర్ అండ్ లైటింగ్
* కన్‌స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్

* బిల్డింగ్ ఎనర్జీ యూజ్ అండ్ ఎఫిషియెన్సీ
* సస్టయినబుల్ అండ్ గ్రీన్ బిల్డింగ్స్

* ఆర్కిటెక్చురల్ డిజైన్ అండ్ హిస్టరీ
* ఇంటిగ్రేషన్ ఆఫ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ బిల్డింగ్ సిస్టమ్స్

* హెల్త్, సేఫ్టీ అండ్ కంఫర్ట్ ఇన్ బిల్డింగ్స్

పై చదువులు అనగానే అందరి కళ్ళ ముందు నిలిచేవి ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ కోర్సులే! ఇంజనీర్ల అవసరం ఈ దేశానికి ఎంతైనా ఉంది. కానీ నాణ్యతలేని చదువుల వల్ల, ట్రెడిషనల్ ఇంజనీరింగ్ కోర్సులు చదవడం వల్ల ఇంజనీర్లకు డిమాండ్ ఉండడంలేదు. క్యాంపస్ రిక్రూట్మెంట్లూ మందగించాయి. పేరున్న కాలేజీలలో చదివితేనే ఆ కాలేజీలకు ఉన్న గుడ్‌విల్ పుణ్యమా అని కొద్దిగా అవకాశాలు ఉంటున్నాయేకానీ మరో రకంగా కాదు. ఎక్కడకు వెళ్ళినా డిమాండ్ మన వెంటే ఉండాలంటే దమ్మున్న కోర్సులను ఎంచుకోవాలి. అలాంటి కోర్సులలో ఇంటర్ డిసిప్లనరీ ఇంజనీరిగ్ కోర్సులు చదువుకుంటే కొంత వరకు పరిస్థితి ఆశాజనకంగా ఉండే అవకాశం ఉంది. ఇంటర్ డిసిప్లినరీ కోర్సులనే ఐటిడిఇ కోర్సులంటారు. భిన్నవిభిన్న టెక్నికల్ ఫీల్డ్‌ను కలగలిపి ఒక కోర్సుగా తయారుచేసేవే ఈ ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు. దీన్ని యునిక్ ప్రోగ్రామ్‌గా విద్యావేత్తలు కీర్తిస్తున్నారు. ఈ కోర్సులు చేయడం వల్ల విద్యార్థికి ట్రెడిషనల్ కోర్సులు ఇవ్వలేని స్పెలైజ్డ్ స్కిల్స్‌ను ఒక ప్యాకేజీగా అందించ గలుగుతాయి. రకరకాల సబ్జెక్ట్‌లను ఒకేసారి చదవడం వల్ల ఇతర ఇంజనీరింగ్ విద్యార్థులకన్నా మెరుగ్గా ఉంటారు. అవకాశాలు కూడా వీరికే ముందుగా వస్తాయి. టెక్సాస్‌లోని ఎ&ఎం యూనివర్శిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ వారు బిఎస్, ఎంఎస్, పిహెచ్‌డి డిగ్రీలను ఆఫర్ చేస్తోంది. ఈ ఇంటర్ డిసిప్లినరీ కోర్సులలో చాలా డిమాండ్ ఉన్న కోర్సు ఆర్కిటెక్చురల్ ఇంజనీరింగ్. ఈ కోర్సు చదువుకుంటే ఇంజనీరింగ్ ప్రిన్సిపుల్స్‌తోబాటే టెక్నాలజీకి సంబంధించిన నైపుణ్యాలు కూడా అలవడతాయి. డిజైనింగ్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్, సేఫ్ మైన్‌టెనెన్స్, హై పెర్ఫార్మెన్స్ అండ్ సస్టయినబుల్ బిల్డింగ్ సిస్టమ్స్, టిపికల్ బిల్డింగ్ సిస్టమ్స్ వంటి సబ్జెక్ట్‌లన్నిటిలో నైపుణ్యం దొరుకుతుంది. వీటిలోనూ హీటింగ్, వెంటిలేటింగ్, ఎయిర్‌కండిషనింగ్ (హెచ్‌విఎసి), స్ట్రక్చరల్ సిస్టమ్స్, ఫైర్ అండ్ లైఫ్ సేఫ్టీ లైటింగ్ అండ్ ఎలక్ట్రికల్ పవర్, కమ్యునికేషన్ అండ్ కంట్రోల్స్ వంటి అనేకాంశాలమీద మంచి పట్టు దొరుకుతుంది. ఆర్కిటెక్చురల్ ఇంజనీర్లు డిజైనింగ్‌లోనూ, బిల్డింగ్ సిస్టమ్స్, కన్‌స్ట్రక్షన్‌లోనూ ఇంజనీర్లు తమదైన ముద్రవేయాలంటే వారికి అనుబంధంగా ఉండే అనేక విభాగాల మీద పట్టు ఉండాలి. ఆర్కిటెక్ట్ తోనూ, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజనీర్లతోనూ ఆర్కిటెక్చురల్ ఇంజనీర్ కలిసి పనిచేయాల్సి ఉంటుంది. వీరికి ఈ విభాగాలన్నిటిమీదా గ్రిప్ ఉంటే తప్ప బాగా పనిచేయలేరు. ఆ విధమైన వెసులుబాటును ఈ ఇంటర్‌డిసిప్లినరీ కోర్సు చదివిన వారికి లభిస్తుంది. అదే సాధారణ సివిల్ ఇంజనీరింగ్ చదివినవారికి ఇంతటి అవకాశం ఉండదు. సాధారణ ఆర్కిటెక్ట్ బిల్డింగ్ ఈస్తటిక్స్, లేఅవుట్, ఫంక్షన్ మీదే దృష్టి ప్రధానంగా ఉంటుంది. అదే ఆర్కిటెక్చురల్ ఇంజనీరింగ్ చేసిన వాడికి సాధారణ ఇంజనీరింగ్ చదివిన వాడి కన్నా ఒక గొప్ప అడ్వాంటేజ్ ఉంటుంది. ఇతను అత్యధునాతన సాంకేతికతను, ఇంజనీరింగ్ సూత్రాలను మేళవించగలుగుతాడు. అంతేకాదు డిజైనింగ్‌లో కంప్యుటేషనల్ టెక్నాలజీస్‌ను, బిల్డ్ అండ్ ఆపరేట్ బిల్డింగ్ సిస్టమ్స్‌ను అదనంగా, సమర్థంగా వినియోగించగలుగుతాడు. ఇతర ఇంజీనీర్లు, ఆర్కిటెక్ట్, కాంట్రాక్టర్‌లు, కన్‌స్ట్రక్షన్ మేనేజర్లు, నగర అధికారులు, భవననిర్మాణ వస్తువుల ఉత్పత్తి దారులతో బాగా కలిసిపోయి పనిచేయగలుగుతారు. సబ్జెక్ట్ సపోర్ట్‌తో వారు ఎంతో చురుకుగా వ్యవహరించగలుగుతారు. ఆర్కిటెక్ట్, సివిల్, మెకానికల్ ఇంజనీర్ల డిమాండ్లు, అవసరాల మేరకు పనిచేయగలుగుతారు. 2020 నాటికి ఆర్కిటెక్చురల్ ఇంజనీర్ల డిమాండ్ భారీగా పెరుగుతుందని అమెరికాలోని కార్మిక శాఖ అంచనా వేసింది. ఈ కోర్సు చదివిన వారికి ప్రొఫెషనల్ ఇంజనీర్లుగా గుర్తింపు ఉంటుంది. ఉద్యోగం కోసం అప్లయ్‌చేసినా, ప్రైవేట్‌గా ప్రాక్టీస్ చేసినా కూడా డిమాండ్ భారీగానే ఉంటుంది. కన్సల్టింగ్ సంస్థలు, సప్లయర్‌లు, ప్రభుత్వ ఏజెన్సీలలో ఉద్యోగిగా చేరగోరితే లీడర్ స్థాయి ఉద్యోగం తేలికగా దొరుకుతుంది. దాన్ని వారు అవలీలగా నిర్వహించగలుగుతారు కూడా!