Home ఎడిటోరియల్ బిట్ కాయిన్ బొమ్మా…బొరుసా..

బిట్ కాయిన్ బొమ్మా…బొరుసా..

cit

అది కరిస్తే కాపాడలేనని తండ్రి చెప్పేలోగానే కొడుకు పామును చేతితో పట్టుకుని ఆటాడుకుంటున్నట్లున్నది దేశంలో బిట్ కాయిన్ ప్రవేశం. బిట్‌కాయిన్ కొనుగోలు మదుపు కు ప్రభుత్వం తాను జిమ్మెదారి కాదని ఏండ్ల తరబడి చెప్పుకుంటూ వస్తున్నా వేలాదిగా పెట్టు బడిదారులు బిట్‌కాయిన్ వైపు తెగింపుగా అడుగు లేస్తూనే ఉన్నారు. తాజాగా 2017, ఫిబ్రవరి, డిసెంబర్ నెలల్లో రిజర్వ్‌బ్యాంకు బిట్ కాయిన్లకు మన దేశంలో చట్ట బద్ధత లేదని, నష్టపోతే ప్రభుత్వంనుండి ఎలాంటి రక్షణ లభించదని హెచ్చరికలు చేసింది. ఈ బెదిరింపులు మాకెందు కన్నట్లు బిట్‌కాయిన్ కొనుగోలుదార్లు సొంత నిర్ణయాలతో ముందుకే సాగుతున్నారు. బిట్‌కాయిన్, ఇథెరిమ్ వంటి క్రిప్టో కరెన్సీల వ్యవహారాలను పరిశీలించేందుకు ఆర్థిక వ్యవహా రాల కార్యదర్శి సుబాష్ గార్గ్ నేతృత్వంలో కమిటీ నియమించామని, ఆ కమిటీ నివేదిక వచ్చేవరకు ఈ కరెన్సీలన్నీ చట్టవిరుద్ధమైనవేనని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రాజ్యసభలో తెలిపారు. ప్రభుత్వం చేతులడ్డుపెట్టినా బిట్‌కాయిన్ దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లోకి వ్యాపిస్తూనే ఉంది. ప్రభుత్వం మాటను బేఖాతరు చేస్తూ దేశంలో ఒక సమాంతర ఆర్థిక వ్యవస్థ ఏర్పడుతోంది. ప్రభుత్వం ప్రజల మంచిచెడులకు, లాభనష్టాలకు జవాబుదారీ వహిస్తుందనే విశ్వసనీయత కూడా క్రమంగా తగ్గిపోతోంది. మరో మార్గం లేక ప్రభుత్వమే ఏదో ఓ రెగ్యులేటరీ అథారిటీని నియమించి అంతా మా అధీనంలో ఉందని తృప్తిపడుతూ నమ్మింపజూ స్తుంది. కరెన్సీ నోటు కాగితం మీది ముద్రస్థాయి నుండి దాటిపోయింది. డెబిట్, క్రెడిట్ కార్డులే కాకుండా ఇవాలెట్ ద్వారా చెల్లింపులు జరిగిపో తున్నాయి. ఈ విధానమంతా కంటికి కనిపించ ని క్రిప్టో కరెన్సీయే. అయితే బిట్‌కాయిన్ షేర్ మార్కెట్లో కొత్త సంచలనం. ఒక్కో బిట్‌కాయిన్ ధర ఈ మధ్య లక్షల్లో ఉంది. బిట్‌కాయిన్ కొనుగోలు ద్వారా ట్రేడింగ్‌లో కొనసాగుతూ దానిద్వారా వివిధ చెల్లింపులు కూడా చేయవచ్చు. ఉదాహరణ కు పిజ్జా బిల్లును కూడా బిట్ కాయిన్ బ్యాలెన్సు నుండి చెల్లించవచ్చు. మిగిలిన మొత్తం ట్రేడింగ్‌లో కొన సాగుతుంది.2009లో సతిషినక మోటో అనే వ్యక్తి పేరుతో ప్రారంభమైన ఈ వ్యవస్థలో అంతా తెరమీద దర్శ నమే. సమాచారమంతా కంప్యూటర్ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. సర్వర్లలోంచి సాంకేతిక వైఫ ల్యాల వల్లగాని, సైబర్ నేరగాళ్ల ద్వారాగాని నిక్షిప్త సమాచారం లుప్తమైతే సొమ్ముకు ఎవరూ బాధ్యు లు కాదు, దీనిపై కోర్టులో వ్యాజ్యం కూడా స్వీక రించబడదు.
ఇప్పటికే 107గిగాబైట్ల డేటా ఈ సర్వర్లలో ఉంది. వాటి నిర్వహణ బాధ్యత బిట్ కాయిన్ అమ్మకం చేసే సంస్థలు స్వీకరిస్తాయి. ప్రపంచ వ్యాప్తంగా లక్షకు పైగా వ్యాపార సంస్థలు బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులను అంగీకరిస్తున్నాయి. కేంబ్రిడ్జి యూనివర్శిటీ పరిశీలన ప్రకారం ఇప్పటికి కోటికి పైగా మదుపుదారులు బిట్‌కాయిన్ వైపు మళ్లారు. మన దగ్గర గత అయిదేళ్లుగా మెల్లమెల్ల గా బిట్ కాయిన్ కదలికలు ఉన్నా అక్టోబర్ 2017 లో దాని ధర ఒక్కసారిగా 250% పెరిగిపోవ డం తో వార్తల్లోకెక్కింది. రూపాయికి రూ.250/- అని తెలియగానే మదుపుదారులు వరసకట్టారు. అయితే ఆ తర్వాత రెండురోజులకే 30% పడిపోయింది. అంటే వంద రూపాయలు డెబ్బకి జారి పోయినట్లు. ఇదంతా ఇన్‌వెస్ట్‌మెంట్, ట్రేడ్ మార్కెట్‌లో మామూ లే. ట్రేడ్, మ్యూచువల్ ఫండ్స్‌పై ప్రభుత్వ నియం త్రణ ఉంటుంది. ట్రేడింగ్ లైసెన్సు అవసరం. షేర్లు ఆఫర్ చేసే సంస్థలు లిస్టింగ్ కావడం తప్పనిసరి. అయితే సంస్థ ఆర్థికంగా బాగుండి మదుపుదారు లను మోసం చేస్తే రెగ్యులేటరీ అథారిటీ నుండి రక్ష ణ లభిస్తుంది. సంస్థ దివాళా తీస్తే షేర్లు కొన్నవారు నష్టపోక తప్పదు. అందుకే షేర్ల కొనుగోలు, మ్యూచువల్ ఫండ్స్‌ల్లో మదుపు ఒడుదుడుకులతో కూడుకున్నది. అయితే బిట్‌కాయిన్‌ల విషయంలో ఏ హామీ లభించదు. అయినా బిట్ కాయిన్లు కొనడానికి పెట్టుబడి వ్యాపారులు ముందుకొస్తున్నారు. 2018లో ప్రభుత్వం కూడా ఓ నిర్ణయానికి రాకతప్పదు. ఎందుకంటే ఈ వ్యాపారం చట్టబద్ధత ద్వారా ప్రభుత్వ నియంత్రణ తో పాటు ఇది పన్ను పరిధిలోకి వస్తుంది.
అసోచెమ్ 2017, ఏప్రిల్ 21నాడు బెంగు ళూరులో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్‌లో బిట్ కాయిన్‌ను ఆహ్వానించింది. మళ్లీ బెంగుళూరులోనే డిసెంబర్ 14, 15 తేదీల్లో బిట్‌కాయిన్‌పై జరిగిన అవగాహనా సదస్సుకు మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు మనదేశంలో సైతం బిట్‌కాయిన్ కొనుగోలు దుకాణంలో సింగరెట్ కొన్నంత తేలిక. నెట్ సదుపాయం ఉన్న స్మార్ట్‌ఫోను ఉంటే చాలు. బిట్‌కాయిన్ అమ్మకం సంస్థలు వరుసకట్టి కని పిస్తాయి. ఎగ్జిబిషన్‌లో దుకాన్ల మాదిరి సర్వసమా చారంతో అవి సిద్ధంగా ఉన్నాయి. కొత్తవారికి అవ గాహన కలిగించడానికి సులభమైన రీతిలో క్లాసులు తీసుకుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరు గుతున్న వ్యాపారానికి సంబంధించిన వార్తలతో పాటు ఆర్థిక నిపుణులు సలహాలు కూడా చూడవచ్చు. దేశంలో ఒక్క బెంగుళూరులోనే వేయికి పైగా బిట్‌కాయినర్లు తమకు ఉన్నారని యూనికయిన్ అనే సంస్థ చెబుతోంది. అందులో అధికులు సాఫ్ట్ వేర్ ఉద్యోగులేనట. బిట్‌కాయిన్ వాలెట్‌ను యాపి ల్ స్టోర్ నుండి గాని, గూగుల్‌ప్లే నుంచి గాని డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అంతా ఆన్‌లైన్ వ్యవహారం కాబట్టి ఎలాంటి ఆర్థికసంస్థల ప్రమేయం లేకుండా ముందుకు సాగవచ్చు.
ఇప్పటికే జపాన్, బ్రిటన్, ఉత్తర కొరియా, ఉక్రెయిన్ దేశాలు బిట్‌కాయిన్‌కు చట్టబద్ధత కల్పిం చాయి. రష్యా, చైనా దేశాలు గుర్తించడానికి ముందుకు వస్తున్నాయి. గుర్తించిన దేశాలు బిట్ కాయిన్‌ను వినిమయవస్తువుగా ప్రకటించి పన్ను పరిధిలోకి తెచ్చాయి.మన దేశంలో బిట్‌కాయిన్ల అమ్మకం జోరందు కుందని, మొదట్లో రోజుకు 20 లావా దేవీలు జరిగేవని ఇప్పుడు డెబ్బయికి పైగా అవు తున్నా యని బై సేల్ డాట్ కో డాట్ ఇన్ సంస్థ తెలియ చేస్తోంది. ధర ఓ చోట స్థిరీకరిస్తే కొనుగోలు దార్ల సంఖ్య మరింత పెరిగి ఆశావహ, ఆరోగ్యకర పరిస్థితికి చేరుకుంటుందని ఆ సంస్థ భావన.
2017 నవంబర్ 11నాడు బిట్‌కాయిన్‌పై ప్రజా ప్రయోజక వ్యాజ్యాన్ని పరిశీలించిన సుప్రీం కోర్టు ఈ విషయంలో ప్రభుత్వం నోరు తెరవ వల సిన అవసరం ఉందన్నది. ఏది ఏమైనా క్రిప్టోకరెన్సీలో వేలు పెట్టడం సామాన్యులతో అయ్యే పనికాదు. ఇదివరకు కూడా షేర్ల ధరల పెరుగుదలకు భ్రమసి అప్పులు చేసి ఈ దందాలో పెట్టుబడి పెట్టినవారు సర్వం కోల్పో యిన దాఖలాలున్నాయి. దేశంలో మిగలు ధనం ఉన్న కుటుంబాలు లక్షల్లో ఉన్నాయి. నష్టాలు తట్టుకునే ఆర్థిక స్తోమత ఉన్నవారు ఈ ప్రయో గాలు చేయవచ్చు. అత్యంత ప్రమాదకరమైన ఈ కొనుగోళ్లలో అవగాహనలేని వాళ్లు ప్రవేశించ కుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.బిట్‌కాయిన్ వైపు ఆకర్షించడానికి ఇంటర్నెట్ లో అవసరానికి మించిన సమాచారముంది. అయితే అదెంత ప్రమాదకారో తెలియజెప్పేందుకు ప్రభుత్వాలు ముందుకు రావాలి. కేవలం పాత్రి కేయుల సమావేశాల్లో కాకుండా సమాచార శాఖ ద్వారా ప్రకటనలిచ్చి ముందస్తుగా దేశపౌరులకు జాగ్రత్తలు సూచించవలసిన బాధ్యత ప్రభుత్వానిదే.