Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

తెలంగాణ జీవనం

kalam

ముదిగంటి సుజాతారెడ్డి నవలల్లో తెలంగాణ జీవనం

ముదిగంటి సుజాతారెడ్డి బాల్యంలోనే తెలంగాణా గ్రామీణ పేదరికాన్ని అన్యాయా ల్ని, విషాదాల్ని కొన్నింటిని ప్రత్యక్షంగా చూడ డం వల్ల, కొన్నింటిని వినడంవల్ల తర్వాత వాటిని ఆత్మసాక్షాత్కారం చేసుకొని ఆ దృశ్యాలకు స్పందించి రచనలు చేశా రు.‘సంకెళ్ళు తెగాయి’లో నిమ్నకులానికి చెందిన యువకుడిని, అతనికి పరిచయం అయిన వ్యక్తులను, గ్రామాల్లోని వివిధ కులవృత్తులను అవలంబించేవారిని, అధికారం గల దొరలను పాత్రలుగా రచయిత్రి స్వీకరించారు.నారాయణ, వేదప్రకాష్, అనల, ఈరయ్య, దానయ్య, లచ్చి, పూలమ్మ వంటి పాత్రలు ఈ నవలలో సహజంగా ఉన్నాయి.‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నవలలో అనేక పాత్రలు ప్రవేశ పెట్టారు. రచయిత్రి తాను చిత్రించిన పాత్రలు నవలలో కథ ముందుకు సాగడానికి దోహదం చేశాయి. రాగిణి, నవతలు ఈ నవలలో ప్రధాన పాత్రలు. రాగిణిలో సంస్కారం, నవతలో అభ్యుదయ భావాలు కన్పిస్తాయి.‘మలుపు తిరిగిన రథ చక్రాలు’లో సుమారు 40 సంవత్సరాలు సాగిన తెలంగాణా ఉద్యమ స్వరూపాన్ని,నాటి ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులను నేపథ్యంగా గ్రహించారు. బహుజన దళిత వాదాన్ని ప్రతిబింబించే నవల ‘సంకెళ్ళు తెగా యి’. నిమ్న కులాలకు చెందినవాళ్ళ కులవృత్తులకు ఆదరణ లేకపోవడం, ఆ కులాల్లోని యువకులు గ్రామాలను వదిలి పట్నాల్లో పనులు చేసుకోవడం వంటి నేప థ్యం ఆధారంగా ఈ నవల చిత్రీకరించబడింది. కులాల అడ్డుగోడలను తెంచుకొని బయటపడిన ఒక వ్యక్తి కథ ఈ నవలకు ఊపిరి పోసింది. స్త్రీ చైతన్యాన్ని నేపథ్యంగా ‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నవలను రచయిత్రి చిత్రించారు.ఆనాటి తెలంగాణ పోరాట ఇతివృత్తంతో ‘మలుపు తిరిగిన రథచక్రాలు’ అనే నవలను రచించారు.ఈ నవల లో 194686 మధ్య కాలపు తెలంగాణ రాజకీయ, సామాజిక, చారిత్రక జీవన స్థితిగతులు ప్రతిబింబించా యి.‘నాలో తిష్ట వేసుకున్న అనుభూతులు, జ్ఞాపకాలు ఈ నవల కల్పనకు ఇతివృత్తం అయ్యాయి’ అని ఆమె ‘నా మాట’లో తెలియజేశాడు.
‘దున్నే వాడిదే భూమి’ అన్న న్యాయాన్ని, సమ సమాజాన్ని స్థాపించడం సాయుధ పోరాట నాయకుడైన రమేశ్ ఆశయం. దొరల పాలనలో వెట్టిచారికి భరించలేని, భూ స్వాముల ఆగడాలతో అణగారిన జీవితం గడుపుతున్న గ్రామ ప్రజలు ఏకమై రహస్య గ్రామ దళాలను ఏర్పరచుకొని దొరలను, దేశముఖులను ప్రతిఘటించేవారు. అం దులో భాగంగానే ఇందూరు దొరను, అన్నారం దేశముఖును హత్య గావించడం, దొరల వద్ద గల భూమి పత్రాలను కాల్చి వేయడం, అధికార దర్పానికి నిలయాలైన గడీలను నామరూపాలు లేకుండా కూల్చడం మొదలగు కార్యాలలో బడుగు, పేద ప్రజలు ప్రదర్శించిన ఐక్యత, సాహసాలు అద్భుతంగా ఉన్నాయి. స్వాతంత్య్రానంతరం రాజకీయస్థితి ఎట్లా ఉందో ఈ నవలలో చిత్రింపబడింది. అవినీతి, స్వార్థపరులైన నాయకుల మూలంగా రాజకీయ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. ప్రజాసంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరకపోవడం,పేదరికం, నిరుద్యోగం, జనాభా పెరుగుదల మొదలగు సమస్యలు దేశంలో ఏ విధంగా చోటు చేసుకున్నాయో రచయిత్రి చిత్రించింది. స్వాతంత్య్రానికి ముందు సాగినటువంటి సాయుధ పోరా టం స్వాతంత్య్రానంతరం కూడా కొనసాగుతూనే వచ్చిం ది. పోరాట నాయకుడు రమేశ్ తన జీవితాన్ని ఉద్యమానికే అర్పితం చేశాడు.
ఒక సంఘటనలో దొర కూతురు సరళ పరిచయం అయినా ప్రేమ అనే బీజం వారిరువురి మనసులో నాటుకున్నా ఉద్యమ బాటలో ఉన్న రమేశ్ ఆ ప్రేమను తిరస్కరిస్తాడు. సరళ మాత్రం దురదృష్టం వెంట పరుగెడుతూ అవినీతి, స్వార్థపరుడైన దాసుని వివాహం చేసుకొని ఎన్నో బాధలు పడుతుంది. తత్ఫలితంగా ఆమెకు ఒక కూతురు పుడుతుంది. కూతురు ఉన్నత విద్యలు చదివి వివాహం చేసుకొని విదేశాలకు వెళ్ళిపోతుంది. సరళకు ఒక మనుమరాలు. ఆ పాపను సరళ వద్దే ఉంచి కూతురు అల్లుడు విదేశాలకు వెళ్ళేటప్పుడు విమాన ప్రమాదంలో మరణిస్తారు.అనారోగ్యంతో ఉన్న సరళ మంచం పడుతుంది. అలాంటి స్థితిలో తన మనుమరాలిని సంరక్షించవలసిన బాధ్యతను తీసుకోవలసిందిగా రమేశ్‌ను కోరుతుంది. అంతవరకు ఉద్యమ మార్గంలో ఉండి, అజ్ఞాతంగా ఉన్న రమేశ్ సరళ ఆహ్వానాన్నందుకొని వస్తాడు. సరళ అభ్యర్థనను అంగీకరించి పాప బాధ్యత స్వీకరిస్తాడు. ఇదే ఉద్యమ రథ చక్రాలు మలుపు తిరగడం. రమేశ్ ఉద్యమాన్ని విడిచి, జన జీవితంలోకి రావడమే ఈ నవలకు ముగింపు.
ఈ నవలలో నారాయణ అనే కథానాయకుడు నిమ్న కులానికి చెందిన వ్యక్తి వారి కులవృత్తి మంగలిపని. ముఖ్యంగా ఈ నవలలో కులవృత్తులపై ఆధారపడి జీవించే గ్రామ ప్రజల వ్యథ కన్పిస్తుంది. నిమ్న కులాలకు చెందిన వారితో సహా చిన్నపాటి రైతు కూలీలు కూడా దొరల ఆజ్ఞలను శిరసావహించి పనులు చేయవలసిందే. కులవృత్తులు చేసుకొనేవారు తమ కష్టానికి తగిన ప్రతిఫలం దొరకక, చాలీచాలని సంపాదనలతో తమ జీవితాలనుగడుపుతారు.అలాంటి పరిస్థితుల్లోనారాయణ పట్నం వెళ్ళి డిగ్రీ చదువుకోవటం అతని తండ్రికి ఇష్టమేకాని అతని తల్లి ఇస్టపడదు. హాయిగా పెళ్ళి చేసుకొని, కులవృత్తిని చేసుకుంటూ బతకమని, వారికి ఉన్న కొంత భూమి తో వ్యవసాయం చేసుకోమని అతని తల్లి ఎన్నోసార్లు కోరుతుంది. అతని తండ్రి మాత్రం తన కొడుకు పెద్ద పెద్ద చదువులు చదువుకొని నౌకరీ చేస్తాడని కలలు కంటాడు.
దొర కొడుకు, నారాయణ ఇద్దరు పట్నంలో ఒకే కాలేజీలో చదువుకుంటుంటారు. అక్కడ కూడా దొర కొడుకు తమ కులం కంటే తక్కువ కులంవాడని, అలాం టి వాడికి చదువెందుకని ఎన్నోసార్లు నారాయణను అవమానించేవాడు. కాని నారాయణ వాటన్నిటిని ఏమి లెక్క చేయకుండా కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేస్తాడు. డిగ్రీ తర్వాత ఎం.ఎ. చదువుకుంటాడు.‘నారాయణ ఎం. ఎ.లో గోల్డ్ మెడల్‌ను సాధించిన తరువాత యు.జి.సి. స్కాలర్‌షిప్‌ను పొంది పిహెచ్.డి.లో ప్రవేశిస్తాడు. పిహెచ్. డి. పరిశోధన చేస్తూనే ఐ.ఏ.ఎస్. పరీక్షకు ప్రిపేరవుతాడు. మొదట రాత పరీక్షలోను, తర్వాత ఇంటర్వ్యూలోను విజయం సాధిస్తాడు.
ఈ విధంగా ఒక నిమ్న కులానికి చెందిన నారాయణ ఉన్నత కులాల నుండి ఎన్ని ఛీత్కారాలు, అవమానాలు ఎదురైనా, తన కుటుంబ పరిస్థితుల మూలంగా ఎంత అవరోధం ఏర్పడినా వాటన్నింటిని అధిగమించి విజయం సాధించడమే ఈనవల ఇతివృ త్తం’. ఈ నవలలో నిమ్న జాతుల, మధ్య తరగతి ప్రజల జీవన స్థితిగతులు చిత్రింపబడినాయి.“సంకెళ్ళు తెగాయి’లో సుజాతారెడ్డికి పరిచయం ఉన్న ఒక నిమ్నకులానికి చెందిన యువకుడు కష్టపడి చదివి పెద్ద ఉద్యోగస్తుడు అయిన విషయాన్ని, ఆ యువకుని జీవితాన్ని కథా వస్తువుగా స్వీకరించారు.
స్త్రీ పురుషుల మధ్య ప్రజాస్వామ్య విలువలతో కలిగిన ప్రేమ సఖ్య సంబంధాలుండాలని కోరుతూ ‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నవలను రచించారు. నేటి సమాజంలో స్త్రీవాదులమంటూ వారు నిర్వహిస్తున్న సం స్థల ద్వారా వారు ఏ విధంగా ద్వంద్వ వైఖరులకు లోనవుతున్నారో రచయిత్రి తాను చూసిన జీవితాలు, అనుభవాలను ఆధారంగా చేసుకొని రచించారు.‘మలుపు తిరిగిన రథ చక్రాలు’లో గ్రామాల్లోని రైతులు, దొరలు, దేశముఖులు, ఉద్యమ నాయకులు, దొర కూతురు, దొర్సానిపాత్ర, ఆడబాపలు, నాటి రాజకీయ నాయకులు వంటి పాత్రలు ఈ నవలలో ఆమె అనుభవ పరిధిని తెలుపుతున్నాయి. వాస్తవికతకు అద్దం పడుతూ నిర్వహించిన పాత్ర పోషణతో కథను సహజసిద్ధంగా రచయిత్రి సాగించారు. సుజాతారెడ్డి బాల్యంలో తాను చిన్నప్పుడు చూసిన వ్యక్తులనే‘మలుపు తిరిగిన రథ చక్రాలు’లో తీసుకొంది. గ్రామాల్లోని రైతులు, దొరలు, దేశముఖులు, ఉద్యమ నాయకులు, దొర కూతురు, దొర్సానీపాత్ర, ఆడబాపలు, నాటి రాజకీయనాయకులు వంటి పాత్రలు ఈ నవలలో ఆమె అనుభవ పరిధిని తెలుపుతున్నాయి. వాస్తవికతను అద్దం పడుతూ నిర్వహించిన పాత్ర పోషణతో కథనుసహజ సిద్ధంగా రచయిత్రి సాగించారు.
‘సంకెళ్ళు తెగాయి’లో నిమ్నకులానికి చెంది న యువకుడిని, అతనికి పరిచయం అయిన వ్యక్తులను, గ్రామాల్లోని వివిధ కులవృత్తులను అలవంబించే వారిని, అధికారం గల దొరలను పాత్రలుగా రచయిత్రి స్వీకరించారు.నారాయణ, వేదప్రకాష్, అనల, ఈరయ్య, దాన య్య, లచ్చి, పూలమ్మ వంటి పాత్రలు ఈ నవలలో సహజంగా ఉన్నాయి.
‘ఆకాశంలో విభజన రేఖల్లేవు’ అనే నవలలో ప్రవేశ పెట్టారు. రచయిత్రి తాను చిత్రించిన పాత్రలు నవలలో కథ ముందుకు సాగడానికి దోహదం చేసాయి. రాగిణి, నవతలు ఈ నవలలో ప్రధాన పాత్రలు. రాగిణిలో సంస్కా రం, నవతలో అభ్యుదయ భావాలు కన్పిస్తాయి.
సుజాతారెడ్డి నవలలో పాత్రలు సందర్భవశాన వచ్చి అంతమయ్యేవి కొన్ని. నవలలో అంతటావిస్తరించి ప్రాముఖ్యాన్ని సంతరించుకొన్నవి కొన్ని. ఇందులో ప్రధానంగా రమేశ్, సరళ, రామచంద్రరావు, అన్నారం దేశముఖు రంగారావు. దాసు, ప్రభాకర్‌లు కనిపిస్తారు. రమేశ్, సరళల పాత్ర సృష్టిలో ప్రాధాన్యం ప్రతిష్టించాలని రచయిత సంకల్పం మిగతా పాత్రలకు అంత ప్రాధాన్యం లేదు. ఈ కారణాన ఈ వ్యాసం ప్రధాన పాత్రలకే పరిమితమవుతుంది. రమేశ్, సరళ పాత్రల నవలా జీవితం రేఖామాత్రంగా తెలిస్తే, ఆ పాత్ర గతంగా రచయిత ప్రతిష్టించిన ప్రజా జీవనం స్పష్టంగా అవగతమవుతుంది.

సయ్యద్ ఆఫ్రీన్ బేగం
9908౦28835

Comments

comments