Home ఆఫ్ బీట్ పిప్పి పళ్లకు హోమియో మందు

పిప్పి పళ్లకు హోమియో మందు

life

ఈ రోజుల్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య పిప్పిపళ్ల సమస్య. దంతాలపై ై తగినంత శ్రద్ధ పెట్టకపోవడం వల్ల పిప్పిపళ్ల సమస్య తీవ్రంగా బాధిస్తోంది. మన జీవన విధానంలో ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు దంతాలను ఏదో విధంగా వాడుతుంటాం. నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత గల పళ్లను నిర్లక్ష్యం చేయటం వల్ల కొన్ని రకాల ఇన్‌ఫెక్షన్స్ తోడై పళ్ళల్లో రంధ్రాలు ఏర్పడి పిప్పి పళ్లుగా మారుతున్నాయి. ఒకప్పుడు వయసు మళ్లిన వారిలో కనిపించే పంటి సమస్యలు, నేడు మారిన ఆధునిక జీవనశైలి విధానం వల్ల పట్టుమని పది సంవత్సరాలు నిండని చిన్నారులు సైతం పిప్పిపళ్ల సమస్యతో బాధపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం చాక్లెట్స్ ఎక్కువగా తీసుకోవడం. ఈ అలవాట్లను పెద్దలు నివారించ లేకపోవటంతో పిల్లలు దంతాల సమస్యతో తల్లడిల్లిపోతున్నా రు. పిప్పిపళ్ల సమస్యను నిర్లక్ష్యం చేయకుండ ప్రారంభదశలోనే డాక్టర్ సలహా మేరకు మందులు వాడితే మంచి ఫలితం ఉంటుంది.

దంతాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం, దీర్ఘకాలిక ఇన్‌ఫెక్షన్స్, ఎక్కువగా ఆల్కహాలు తీసుకోవడం. అతి చల్లని, అతి వేడి పదార్థాలు తీసుకోవడం, చాక్లెట్స్ అతిగా తినడం.
లక్షణాలు:
దంతాలు నొప్పిగా ఉండి నమలడం కష్టంగా ఉంటుంది.
పంటి చిగుళ్లు వాపుతో కూడి ఉండి రక్తం కారుతూ ఉంటుంది.
అతి చల్లని, అతి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలు జివ్వున లాగుతాయి.
దంతాల నొప్పి వలన పిల్లలు ఆహార పదార్థాలను నమల లేక ఏడుస్తుంటారు.
ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పంటి నొప్పితో పాటుగా జ్వరం కూడ వచ్చును.
జాగ్రత్తలు:
దంతాలను రోజుకు రెండుసార్లు శుభ్రపరుచుకోవాలి. ఉదయం లేవగానే ఒక సారి, పడుకునేముందు ఒక సారి శుభ్రంగా కడుక్కోవాలి.ఐస్ క్రీములు, కూల్‌డ్రిక్స్ వంటి అతి చల్లని పదార్థాలు తీసుకోవటం మాని వేయాలి. అలాగే కాఫీ, టీ లాంటి అతి వేడైన పదార్థాలు కూడ తీసుకోకూడదు.
పళ్లు తోముకునే బ్రష్షుల్లో హార్డ్ రకం బ్రష్షులను ఉవయోగించి ఎక్కువ బలంగా తోమకూడదు.
పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్, స్వీట్స్ తీసుకున్న వెంటనే నీరును పుక్కిలించి దంతాలను శుభ్ర పరుచుకోవాలి. దీర్ఘకాలికంగా చిగుళ్ల వ్యాధితో బాధపడేవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టరును సంప్రదించాలి.
డాక్టర్ సలహా లేకుండా రకరకాల టూత్‌పేస్ట్‌లను వాడకూడదు.
మందులు
పిప్పిపళ్ల సమస్య నివారణకు హోమియో వైద్యంలో మంచి మందులు ఉన్నాయి. అందు లో కొన్ని ముఖ్యమైన మందులను ఈ క్రింద పొందుపర్చడం జరిగింది.
మెర్కసాల్: పంటి చిగుళ్లు వాపు వచ్చి రక్తం కారుతూ ఉంటాయి. అతి చల్లని, అతి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలు జివ్వు మంటాయి. పంటి నొప్పి రాత్రి పూట ఎక్కువగా ఉండి నిద్రపట్టక పోవడం. ఇటువంటి లక్షణాలున్నవారికి ఈ మందు తప్పక ఆలోచించ దగినది.
ప్లాంటాగో: పిప్పిపళ్ల సమస్యతో బాధపడే వారికి ఈ మందు చాలా బాగా పని చేస్తుంది. ఈ మందు ద్రావణమును దూదిపై రెండు లేదా మూడు చుక్కలు వేసి నొప్పి ఉన్న పంటిపై ఉంచి అదిమి పడితే నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.
ఇలా ఒక వారం రోజులు రోజుకు రెండు సార్లు చేయటం వల్ల పంటి చిగుళ్ల ఇన్‌ఫెక్షన్స్, వాపు తగ్గి పోతుంది.
క్రియోసోటినం: దంతాలు అతి త్వరగా ఇన్‌ఫెక్షన్స్ వల్ల పుచ్చిపోతుంటే ఈ మందు వాడి ప్రయోజనం పొందవచ్చును. వీరు చల్లటి పదార్థాలు తీసుకొన్న దంతాలు జువ్వున లాగు తుంటాయి. అలాగే పంటి చిగుళ్లు వాపుతో కూడి ఉండి రక్తం కారుతూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలున్నవారికి ఈ మందును వాడితే ఉపశమనం పొందవచ్చు.
స్టాఫిసాగ్రియా: పిప్పి పంటి నొప్పి తీవ్రంగా ఉండి దంతాలు నల్లగా మారుతాయి. పంటి చిగుళ్లు వాపుతో ఉండి రక్తం కారుతూ ఉంటుం ది. అతి చల్లని లేదా అతి వేడి పదార్థాలు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పితో జివ్వుమంటూ ఉంటాయి. పంటి నొప్పి, మెన్సెస్ సమయంలో ఎక్కువగుట గమనించ దగిన లక్షణం. ఇటువంటి లక్షణాలున్న వారికి ఈ మందు తప్పక ఆలోచించదగినది.
బెల్లడోనా: పిప్పి పంటి నొప్పి తీవ్రంగా ఉండి నొప్పి అన్ని వైపులకు విస్తరిస్తూ ఉంటుంది. దంతాలు నొప్పిగా ఉండి నమలడం కష్టంగా మారును. నొప్పి పంటి నుండి చెవిలోకి, గొంతులోకి, తల కణతలలోకి వ్యాపించును. దీంతో నోరు తెరువాలన్న కష్టంగా ఉంటుంది. ఇటువంటి లక్షణాలున్నప్పుడు ఈ మందు బాగా పనిచేస్తుంది. ఈ మందులే కాకుండా కాఫియాక్రూడ, కామామిల్లా, స్పైజీలియా, మెగ్నిషియంఫాస్, సల్ఫర్, కాల్కేరియా ఫ్లోర్, మెడోరినం, తూజా, లైకోపోడి యం ఫాస్పరస్ తదితర మందు లను లక్షణ సముదాయాన్ని అను సరించి వాడిన పిప్పిపళ్ల సమస్య నుండి విముక్తి పొందవచ్చును.