Search
Wednesday 21 November 2018
  • :
  • :

రెడీమేడ్ అవయవాలు

Heart

మూలకణాల ఆవిష్కరణ వైద్యరంగంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తోంది. గుండె, మూత్రపిండాలు, కాలేయం వంటి అనియంత్రిత అవయవాలతో పాటు శరీరంలో ఏ అవయవం చెడిపోయినా, సరిగ్గా పనిచేయకపోయినా వాటిస్థానంలో కొత్త అవయవాలను తయారు చేసి అమర్చుకోడానికి మూలకణాలు సృష్టికర్తగా తమ పాత్ర పోషిస్తున్నాయి. దాతలనుంచి అవయవాలు సేకరించడం ఇప్పుడు జరుగుతోంది. ఇకపై ఈ వ్యయ ప్రయాసలు ఉండకపోవచ్చు. తయారైన అవయవాలు సులువుగా లభించే రోజులు వస్తున్నాయి. రోగి సొంత మూలకణాలనే సేకరించి ప్రయోగశాలల్లో వాటి ఆధారంగా కోరుకున్న అవయవాలను సృష్టించే అపర బ్రహ్మలవుతున్నారు శాస్త్రవేత్తలు.

రక్తనాళాలను తయారు చేసి రోగికి అమర్చగలుగుతున్నారు. దీంతో మరికొన్ని ముఖ్యమైన అవయవ నిర్మాణానికి దారి చూపినట్టయింది. రక్తనాళాలే కాదు ధమనులు వంటివి త్వరలోనే తయారు చేయవచ్చని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రయోగశాలలో తయారైన నరాలు, రక్తనాళాలు, డయాలసిస్ రోగులకు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారికి కూడా అమర్చవచ్చని బ్రిటన్ వైద్యశాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. శరీరంలో ఎక్కడైనా ధమనులను తిరిగి అమర్చడం, రక్తపోటు, రక్తం ఒత్తిడి బాగా ఉండే గుండెవంటి భాగాలలోనూ వీటిని అమర్చగలగడం సాహసోపేత చర్యగా యాలె యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. ఇలాగే పరిశోధనలు కొనసాగితే కొద్దికాలంలోనే లక్షాలు సాధించవచ్చని వైద్యనిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments