Home ఆఫ్ బీట్ కృత్రిమ అండాశయంతో సంతానం

కృత్రిమ అండాశయంతో సంతానం

'Artificial ovary' could help women conceive after chemotherapy

కేన్సర్ చికిత్స కారణంగా సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోయిన మహిళలకు కృత్రిమ అండాశయాన్ని అమర్చి సంతానోత్పత్తికి అవకాశం కలిగించే కొత్త ప్రక్రియను శాస్త్రవేత్తలు కనుగొనగలిగారు. ఐరోపా, కొపెన్‌హెగెన్ సంతాన సాఫల్య కేంద్రాలకు చెందిన పరిశోధకులు తాము బయోఇంజినీర్డ్ మానవ అండాశయాన్ని రూపొందించి మొదట జంతువులపై ప్రయోగాలు చేశామని చెప్పారు. అండోత్పత్తికి ముందు అత్యవసరంగా చికిత్స పొందాలనుకున్న మహిళలు అండంలోని కణ సముదాయంపై ఆధారపడతారు. పరిపక్వత చెందని అండాలు వేల కొలది ద్రవం నిండిన సంచుల్లో ఉంటాయి. చికిత్స తరువాత వీటిని తిరిగి అండంలోకి చేర్చడానికి వేరుగా భద్రపరుస్తారు. అలా భద్రపరిచిన వాటిలో కేన్సర్ కణాలు ఏవైనా ఉంటే తిరిగి వాటిని అండాశయంలో చేర్చడం ఎంతో రిస్క్‌తో కూడున్నది. అందువల్ల ఈ రిస్క్‌ను తొలగించడానికి డేనిష్ ప్రక్రియ అవసరం అవుతుంది. దీని వల్ల సంతాన సాఫల్యత అభివృద్ధి చెందుతుందిచెందుతుంది.