Home జోగులాంబ గద్వాల్ తెలుగు మహాసభలకు తరలిన కళాకారులు

తెలుగు మహాసభలకు తరలిన కళాకారులు

bus

మనతెలంగాణ/గద్వాల న్యూటౌన్: హైదరాబాద్‌లో ఘనంగా జరుగుతు న్న ప్రపంచ తెలుగుమహాసభలు ము గింపు రోజైన మంగళవారం జోగు ళాంబ గద్వాల జిల్లా నుండి 5 బస్సు లు బయలు దేరాయని జిల్లా జాయిం ట్ కలెక్టర్ డాక్టర్ సంగీత తెలిపారు. జిల్లా కలెక్టరేట్ ఆవరణ నుండి ఉద యం 9 గంటలకు 4 బస్సులు, అలం పూర్ జోగుళాంబ దేవాలయ నుండి 1 బస్సు బయలుదేరగా జాయింట్‌కలెక్టర్ సంగీత,మార్కెట్‌యార్డు ఛైర్‌పర్సన్‌బండ్ల లక్ష్మీదేవమ్మ లు జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ప్రపంచ తెలుగుమహాసభలకు కవులు ,కళాకారు లు,బాషాభిమానులు పెద్ద ఎత్తున తరలివెళ్లడం జరగింది. ఈ సభలకు వెళ్లేవారికి భోజనవ స తి కల్పించి తిరిగి మంగళవారం రాత్రికి గద్వాలకు వచ్చేలా తగు చర్యలు తీసుకున్నట్లు ఆమె తెలిపారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న మార్కెట్ యార్డు ఛైర్మన్ బండ్ల లక్ష్మీదేవమ్మ మాట్లాడు తూ తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రపంచ తెలుగుమహాసభలను నిర్వహించడం గర్వకా రణమన్నారు. ఈసందర్భంగా తెలుగుమహాసభలకు బయలుదేరే కవులు, కళాకారులు,బాషా భిమానులను బస్సులో ఉన్న అందరిని పలకరించి వారికి విడ్కోలు పలికారు.ఈ కార్యక్రమం లో డిఆర్‌ఓ వేణుగోపాల్, డిఇఓ వేణుగోపాల్, డిపిఆర్‌ఓ సీతారామ్ తదితరులు పాల్గొన్నారు.