Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

తగినంతగా మారక నిల్వలు

Arun Jaitley has responded fall rupee value against dollar

వర్ధమాన దేశాల మార్కెట్లను పరిశీలిస్తున్న ప్రభుత్వం
పరిస్థితులు మరింత విషమిస్తే జోక్యం
రూపాయి పతనంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం కావడంపై కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్పందించారు. టర్కీలో ఆర్థిక సంక్షోభం కారణంగా వర్ధమాన దేశాల కరెన్సీలు వతనం కావడం వంటి పరిణామాలను ప్రభు త్వం పరిశీలిస్తోందని, అంతర్జాతీయ పరిస్థితులు మరింత విషమిస్తే జోక్యం చేసుకునేందుకు సిద్ధం ఉందన్నారు. బుధవారం ఆయన ఈమేరకు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. దేశ చరిత్రలో తొలిసారిగా డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది. డాలర్‌పై చారిత్రక కనిష్ఠం 70కి క్షీణించింది. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ స్పందిస్తూ, కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఎదురైనా ఎదుర్కొనేందుకు దేశంలో సరిపోయే విదేశీ మారక నిల్వలు ఉన్నాయని అన్నారు. టర్కీ కరెన్సీ లిరా ప్రభావంతో విదేశీ మార్కెట్లపై ప్రభావం పడింది. అదే సమయంలో అమెరికా కరెన్సీ డాలర్ మరింతగా బలపడుతోంది. దీంతో డాలరుతో రూపాయి మారకం విలువ మంగళవారం రూ.70.09 పడిపోయింది. రూపాయితో పాటు వివిధ దేశాల కరెన్సీ విలువ కూడా భారీగా పతనమయ్యాయి. ఒకవేళ కరెన్సీ మార్కెట్‌లో ఎలాంటి అస్థిరత ఏర్పడినా ఆ తీవ్రత తగ్గించడానికి భారత్‌కు సరిపడా విదే శీ మారక నిల్వలు ఉన్నాయని జైట్లీ వివరించారు. ఎప్పటికప్పుడు అంతర్జాతీయ పరిణామాలను పరిశీలిస్తున్నామని అన్నారు. పరిస్థితులు క్షీణిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రస్తుతం దేశంలో ఆగస్టు 3 నాటికి 402.70 బిలియన్ డాలర్లు ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్‌బిఐ రంగంలోకి దిగే అవకాశం లేకపోలేదని నిపుణులు పేర్కొంటున్నారు. కాగా చరిత్రలో తొలిసారి రూపాయి 70 మార్క్ దిగువకు చేరింది. అంతర్జాతీయ కారణాల వల్లే రూపాయి పతనమవుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొద్ది రోజుల్లో రూపాయి సాధారణ స్థితికి చేరుకుంటుందని ప్రభుత్వం అభయమిస్తోంది.

మంగళవారం డాలరుతో మారకంలో రూపా యి 69.77 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్‌లో డాలర్‌పై రూపాయి 69.71- నుంచి 70.10 మధ్య శ్రేణిలో కదలాడింది. 2013 నుంచి రూపాయి ఒక రోజు అతిపెద్ద పతనం ఇదే. మంగళవారం ట్రేడింగ్ ఆరంభంలోనే రికా ర్డు స్థాయిలో పడిపోయిన రూపాయి, డాలర్‌తో మారకం రూ.70కి చేరింది. టర్కీలో ఆర్థిక మాం ద్యం భయాల నేపథ్యంలో ఆ దేశ కరెన్సీ టర్కిష్ లిరా భారీగా పతనమవుతుండడంతో ఆ ప్రభావం మన కరెన్సీపైనా పడుతోంది. సోమవారం రూపాయి మారకం విలు వ ఏకంగా 110 పైసలు పడిపోయిన సంగతి తెలిసిందే. చైనా, యూరోపియన్ దేశాలతో వాణిజ్య వివాదాలకు తెరతీసిన అమెరికా ప్రభుత్వం గత వారం టర్కీ దిగు మతులపై దృష్టి పెట్టిం ది. స్టీల్, అల్యూమినియం దిగు మతులపై టారిఫ్ లను రెట్టింపు చేయడంతో టర్కీ కరెన్సీ లైరా మారకపు విలువ భారీగా పతనమైంది.

Comments

comments