Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

నోట్ల రద్దుతో మదుపుదారుల సంఖ్య పెరిగింది: ఆర్థిక సర్వే

ECONOMIC-SURVEY-2018-19

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ సోమవారం ఆర్థిక సర్వేను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక సర్వేలో 2017-18లో వృద్ధిరేటు 6.75 శాతంగా, 2018-19లో వృద్ధిరేటు 7 నుంచి 7.5 శాతంగా ఉండొచ్చని ఆర్థిక సర్వే అంచనా. ఉపాధి, విద్య, వ్యవసాయ రంగాలకు ప్రాధాన్యత కల్పించారు. త్రైమాసిక వృద్ధిరేటను పరిశీలిస్తే వార్షిక వృద్ధిరేటు మందగిస్తున్నట్లు కినిపించింది. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో గణనీయంగా రాబడి పెరిగిందని ఆర్థిక సర్వేలో వెల్లడైంది. వ్యవసాయేతర రంగాల్లో అనుకున్న దానికన్నా ఉపాధి పెరిగింది. ఇతర దేశాలకన్నా మన ఎగుమతులు బాగున్నాయి. వస్త్ర పరిశ్రమకు ప్రోత్సాహాకాలతో రెడిమేడ్ దుస్తుల ఎగుమతులు పెరిగాయి. వ్యవసాయ దిగుబడులపై వాతావరణం ప్రతికూల ప్రభావం చూపింది. భారత ఆర్థిక వ్యవస్థకు జిఎస్‌టి కొత్త ఊపునిచ్చిందని ఆర్థికసర్వే పేర్కొంది. పన్ను చెల్లింపుదారులు 50 శాతం పెరిగారు. జిఎస్‌టి వల్ల చిన్న వ్యాపారుల నమోదు శాతం పెరిగింది. రాష్ట్రాల నుంచి విదేశీ ఎగుమతుల పెరుగుదల నమోదైందని, ఎగుమతుల్లో 70 శాతం మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, తెలంగాణ నుంచే ఉన్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. అలాగే నోట్ల రద్దు వల్ల మదుపుదారుల సంఖ్య పెరిగిన్నట్లు ఆర్థిక సర్వే వివరించింది.

Arun Jaitley Introduced the Economic Survey in Parliament.

Comments

comments