Home జాతీయ వార్తలు అరుణాచల్‌లో ఉగ్రకాల్పులు

అరుణాచల్‌లో ఉగ్రకాల్పులు

 

ఎంఎల్‌ఎ సహా 11మంది దుర్మరణం 
మృతుల్లో ఎంఎల్‌ఎ కుటుంబ సభ్యులు

గువాహతి: అరుణాచల్ ప్రదేశ్ లో మంగళవారం మిలిటెంట్లు జరిపిన కాల్పుల్లో పదకొండు మంది మరణించారు. వారిలో తిరప్ జిల్లాలో ఖోన్సా వెస్ట్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) శాసనసభ్యుడు తిరోంగ్ అబోహ్ కూడా ఉన్నారు. రాష్ట్రంలో ఆగ్నేయ దిశలో ఉనన ఖోన్సా జిల్లా కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోగపానిలో మంగళవారం ఉదయం దాదాపు 11.30 గంటల  ప్రాంతంలో మిలిటెంట్లు ఎంఎల్‌ఏ తిరోంగ్ కాన్వాయ్‌పై దాడి చేశారని పోలీసులు తెలిపారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ (ఎన్‌ఎస్‌సిఎన్) మిలిటెంట్లు ఈ దాడి జరిపినట్టు తొలి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. అబోహ్ కుమారుడితో సహా ఆయన కుటుంబంలోని వారు ఈ దాడిలో మరణించినట్టు తెలుస్తోంది. ఈ దాడి దురదృష్టకరం, ఈ సంఘటన విని తీవ్ర దిగ్భ్రాంతి చెందాను. దుండగుల్ని పట్టుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాం’ అని అరుణాచల్ ప్రదేశ్ సిఎం పేమా ఖండూ ట్వీట్ చేశారు. తిరోంగ్ మృతిపట్ల ఎన్‌పిపి అధ్యక్షుడు, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా విచారం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో బాధితులకు న్యాయం జరిగేందుకు ప్రధానమంత్రి కార్యాలయం, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.

 Arunachal pradesh MLA killed in militant ambush