Home జాతీయ వార్తలు నిందితులుగా సిఎం, డిప్యూటి సిఎం…

నిందితులుగా సిఎం, డిప్యూటి సిఎం…

Arvind Kejriwal, Deputy Charged For Alleged Assault

న్యూఢిల్లీ: ఈ సంవత్సరం ఫిబ్రవరిలో సిఎం కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన సమావేశంలో తనపై దాడి చేసి కొట్టారని  ఢిల్లీ ప్రధాన కార్యదర్శి అన్షు ప్రకాశ్‌ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  అన్షు ప్రకాశ్ పై దాడి చేసిన కేసులో సిఎం కేజ్రీవాల్ తో పాటు డిప్యూటి సిఎం మనీశ్ సిసోడియాల పేర్లను పోలీసులు నిందితులుగా చేర్చారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు దాఖలు చేసిన ఛార్జిషీటులో కేజ్రీవాల్‌, సిసోడియాల పేర్లతో పాటు 11 మంది మంత్రులు, శాసనసభ్యుల పేర్లు ఉన్నాయి. ఆప్‌ మూడు సంవత్సరాల పాలనపై టివి ప్రచార కార్యక్రమం విడుదల చేసేందుకు ఎందుకు ఆలస్యమవుతుందో వివరణ ఇవ్వాలని కేజ్రీవాల్‌ తన‌ను అడిగారని ఆయన తెలిపారు. అనంతరం ఎంఎల్ఏలు తనపై దాడి చేశారని అన్షు ప్రకాశ్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు.