Home జాతీయ వార్తలు అరవింద్ సుబ్రహ్మణ్యం రాజీనామా!

అరవింద్ సుబ్రహ్మణ్యం రాజీనామా!

ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి తప్పుకుంటానని ప్రకటన

Subramanyam-Swami

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుడు  అరవింద్ సుబ్రహ్మణ్యం  ఆర్థిక మం త్రిత్వ శాఖ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఒకటి రెండు నెలల్లో తాను వైదొలుగవచ్చని తెలిపారు. నాలుగు సంవత్సరాలు ఆర్థిక సలహాదారుడిగా పని చేసిన సుబ్రహ్మణ్యం మం త్రిత్వ శాఖ నుంచి వెళ్లి పోతారని కొద్ది రోజుల క్రితం కేంద్ర ఆర్థిక  శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రకంటించారు.  కుటుంబ బాధ్యతల వల్లే ఆయన తప్పుకుంటున్నారని మంత్రి తెలిపారు. తాను మంచి ఉద్యోగంలో ఉన్నానని, ఇటువంటి గొప్ప ఉద్యోగం గతంలో ఎన్నడూ చేయలేదని సుబ్రహ్మణ్యం అన్నారు. తాను మంత్రిత్వ శాఖ నుంచి మంచి జ్ఞాపకాలతో వెళ్లి పోతానని, తాను దేశానికి సేవ చేయాలన్న సంకల్పంతోనే ఉన్నానని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా సేవ చేస్తానని ఆయన చెప్పారు. నిజానికి మంత్రి జైట్లీ తన కలల అధికారి అని కొనియాడారు. సుబ్రహ్మణ్యంని  ప్రభుత్వం ఆర్థిక సలహాదారుడిగా 2014, అక్టోబర్  16న మూడేళ్లపాటు బాధ్యతలు నిర్వహించడానికి  నియమించింది. అయితే 2017లో  ఆయన పదవి కాలాన్ని మరో ఏడాదిపాటు పెంచింది. అయితే కుటుంబ బాధ్యతల వల్లే ఆయన తిరిగి అమెరికా వెళ్తున్నారని జైట్లీ బుధవారం చెప్పారు.  చీఫ్ ఎకనామిక్ అడ్వయిజర్‌గా నాలుగు సంవత్సరాలుగా  సుబ్రహ్మణ్యం పని చేస్తున్నారని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వం అనుసరిస్తున్న తప్పుడు ఆర్థిక విధానాల వల్లనే అరవింద్ సుబ్రహ్మణ్యం రాజీనామా చేస్తున్నారని కాంగ్రెస్ ప్రతినిధి రందీప్ సుర్జేవాలా ఆరోపించారు. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాలతో విసిగి పోయి అరవింద్ తప్పుకుంటున్నారని ఆయన అన్నారు.