Home తాజా వార్తలు టిఆర్‌ఎస్‌లో చేరిన ఆర్యవైశ్యులు

టిఆర్‌ఎస్‌లో చేరిన ఆర్యవైశ్యులు

Arya Vysyas Joined in TRS

హైదరాబాద్ : మంత్రి కెటిఆర్ సమక్షంలో పలువురు ఆర్యవైశ్యులు టిఆర్‌ఎస్‌లో చేరారు. వారికి కెటిఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడారు. అగ్రకులాల్లో కూడా పేదలు ఉన్నారని కెటిఆర్ పేర్కొన్నారు. అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన చెప్పారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు అన్ని విధాల అన్యాయం జరిగిందని ఆయన తెలిపారు. ప్రత్యేక తెలంగాణ కోసం 1969లో ఉద్యమించిన తెలంగాణ బిడ్డలను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌దని ఆయన ధ్వజమెత్తారు.

Arya Vysyas Joined in TRS