Home జాతీయ వార్తలు హిందీని తప్పనిసరి చేస్తారా..?

హిందీని తప్పనిసరి చేస్తారా..?

Asaduddin Owaisiహైదరాబాద్: లోక్ సభ సమావేశాల సందర్భంగా సొమవారం నూతన కేంద్ర ప్రభుత్వ విద్యా విధానం పై జరిగిన చర్చలో హైదరాబాద్ ఎం.పీ అసదుద్దీన్ ఒవైసీ స్పందిస్తూ దేశ వ్యాప్తంగా హిందీని తప్పని సరిచేస్తారా…? ఉర్దు భాషకు త్రిభాషా సూత్రంలో ఏలాంటి ప్రాధాన్యత ఇస్తారని కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేష్ పొక్రియాల్ ను ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి స్పందిస్తూ నూతన విద్యా విధానంలో ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ,తమిళంతో పాటు అన్ని భారతీయ భాషలకు సముచిత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు.

ఈ నూతన విద్యా విధానం కేవలం రంగరాజన్ కమిటీ ప్రతిపాదనల స్వరూపంగా మంత్రి పేర్కొన్నారు. ఇంకా ఈ నూతన విద్యా విధానం చట్ట రూపం దాల్చలేదని విషదీకరించారు. ఈ నూతన విద్యావిధానం కేవలం డ్రాప్ట్‌గా మంత్రి వివరించారు. ఈ మూసాయిదా ప్రతిపాదనలను సభ్యులు పరిశీలించి, కేంద్ర ప్రభుత్వానికి సలహాల, సూచనలు ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ నేపథ్యంలో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా జోక్యం చేసుకొని మరో సారి విస్తృతంగా నూతన విద్యా విధానం పై చర్చిందామని సభ్యులకు తెలిపారు.

Asaduddin owaisi Said Hindi compulsory in lok sabha