Home ఆదిలాబాద్ వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముట్టడి

వైద్యఆరోగ్యశాఖ కార్యాలయం ముట్టడి

13adadb20pఆదిలాబాద్ టౌన్ : ప్రజాప్రతినిధులకు లక్షలాది రూపాయల వేతనాలను పెంచుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశా కార్యకర్తలకు నెలకు కేవలం 400 రూపాయలను మాత్రమే చెల్లించడం సిగ్గుచేటని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి డి. మల్లేష్ పేర్కొన్నారు. తమకు కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేస్తు సిఐటియు ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయాన్ని ముట్టడించారు. కార్యాలయం ఎదుట బైటాయించి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినదించారు.

కార్యక్రమంలో సంఘం నేతలు లక్ష్మి, శారద, సుగుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేష్ మాట్లాడుతూ ఆశా కార్యకర్తలతో ప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తు వేతనాలను విస్మరిస్తుందని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వైద్యసేవలందించేలా శ్రద్దవహిస్తున్నవారికి 400 వేతనం చెల్లిస్తుందని దాంతో వారి కుటుంబ పోషణ ఎలా సాగాలని ప్రశ్నించారు. ఆశాకార్యకర్తలను నాల్గొ తరగతి ఉద్యోగులుగా గుర్తించి, 15000 కనీస వేతనాలను చెల్లించాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం త్వరితగతిన స్పందించి స్పష్టమైన హామీనివ్వాలన్నారు. లేనిపక్షంలో సెప్టెంబర్ 2 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతామని స్పష్టం చేశారు.