Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

ఇంగ్లాండ్‌కు చావోరేవో

నేటి నుంచి యాషెస్ మూడో టెస్టు

EBG

పెర్త్: ఇప్పటికే రెండు టెస్టులు గెలిచి ఊపుమీదున్న ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేసింది. మరోవైపు ఇంగ్లాండ్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. తొలి రెండు టెస్టులో ఓటమి పాలైన ఇంగ్లాండ్ ఇందులోనూ ఓడితే సిరీస్ కోల్పోవడం ఖాయం. అంతేగాక, సిరీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగిస్తే తర్వాతి రెండు టెస్టుల్లో కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అప్పుడూ సిరీస్ సమం చేసే అవకాశం మాత్రమే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఒత్తిడిని తట్టుకొని ముందుకు సాగడం ఇంగ్లాండ్‌కు అంత సులువుకాదనే చెప్పాలి. బౌలర్లు మెరుగ్గానే రాణిస్తున్న బ్యాటింగ్ వైఫల్యం ఇంగ్లాండ్‌ను వెంటాడుతోంది. ముఖ్యంగా సీనియర్ ఆటగాడు అలిస్టర్ కుక్ సిరీస్‌లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగైన బ్యాటింగ్ కనబరచాల్సి ఉంటుంది. కుక్ కెరీర్‌లో ఇది 150వ టెస్టు మ్యాచ్ కానుంది. మరోవైపు వరుస విజయాలతో జోరుమీదున్న ఆస్ట్రేలియా సిరీస్‌పై కన్నేసింది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే బ్యాట్స్‌మెన్, బౌలర్లు ఆసీస్‌కు అందుబాటులో ఉన్నారు. దీంతో వారు ఈ మ్యాచ్‌లోనూ విజయమే లక్షంగా పెట్టుకున్నారు.

Comments

comments